వైయస్ జగన్‌పై దుమ్మెత్తి పోసిన ఎపి మంత్రులు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు దుమ్మెత్తిపోశారు. అక్రమ సంపాదనను కాపాడుకోవడం కోసమే జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు.
వైసీపీ నుంచి చాలా మంది నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అలాంటి వారిని కాపాడుకునేందుకే జగన్ దీక్షల పేరుతో నాటకం ఆడుతున్నారని చెప్పారు. జగన్ లాంటి అవినీతిపరుడు, నియంత అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పల్లె విమర్సించారు.

వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని జగన్‌కు ఇప్పటి నుంచే భయం పట్టుకుందని మంత్రి రావెల విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన రైతు యాత్రతో ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో సింగపూర్ మాదిరిగా ఏపీలో కూడా సింగిల్ పార్టీ విధానం రాబోతోందని మంత్రి రావెల చెప్పారు.
నదుల అనుసంధానం అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని, రైతులు, రైతు సంక్షేమంపై బాబు ప్రత్యేక శ్రద్ధపెట్టారని మంత్రులు తెలిపారు.












Click it and Unblock the Notifications