వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భువనేశ్వరి తమకు సోదరి వంటిది: మంత్రి బాలినేని; సీఎం కాడనే చంద్రబాబు హైడ్రామా: మంత్రి అనిల్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో జరిగిన అవమానం, ఆ తర్వాత ఆయన కన్నీటి ఎపిసోడ్ రాజకీయ దుమారం రేపింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చంద్రబాబు కన్నీరు పెట్టుకుంది లేదని, చంద్రబాబు సతీమణి పై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎప్పుడూ రాజకీయాల విషయంలో మాట్లాడని నందమూరి కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ తో సహా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏపీ రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మాధవరెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్; ఆస్కార్ లెవల్ యాక్షన్: రివెంజ్ తీర్చుకున్న వల్లభనేని వంశీమాధవరెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్; ఆస్కార్ లెవల్ యాక్షన్: రివెంజ్ తీర్చుకున్న వల్లభనేని వంశీ

అసెంబ్లీలో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

అసెంబ్లీలో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

ఇదిలా ఉంటే అసలు చంద్రబాబు సతీమణిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, చంద్రబాబు సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని, నిజంగా చంద్రబాబు సతీమణి ఎవరైనా ఏమైనా అంటే ఎవరన్నారు ఏమన్నారో చెప్పాలని వైసిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఇక తాజాగా శుక్రవారం నాడు అసెంబ్లీలో జరిగిన ఘటనపై మాట్లాడిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరినీ కించపరుస్తూ మాట్లాడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో మంత్రులు మాధవరెడ్డి , వంగవీటి రంగా హత్య గురించి చర్చించాలని అన్నారే తప్ప, మరే ఇతర వ్యాఖ్యలు చేయలేదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

భువనేశ్వరి తమకు సోదరిలాంటిది .. ఆమెను తప్పుగా మాట్లాడలేదు

భువనేశ్వరి తమకు సోదరి లాంటిదని, భువనేశ్వరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోమని మంత్రి బాలినేని తేల్చిచెప్పారు. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారని వస్తున్న ఆరోపణలను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారని, అందుకే అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని ఆరోపణలు గుప్పించారు. ఇది సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామా అని పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహించరని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

మహిళల పట్ల వైసీపీకి, జగన్ కు అపార గౌరవం

మహిళల పట్ల వైసీపీకి, జగన్ కు అపార గౌరవం


మహిళలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అపారమైన గౌరవం ఉందని పేర్కొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మహిళలను గౌరవించే తాము ఎందుకు దూషిస్తాము అంటూ ప్రశ్నించారు. వివేకానంద హత్య కేసులో వైయస్సార్ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు అనవసరపు వ్యాఖ్యలు చేశారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాత్రమే వైసీపీ నేతలు ఎలిమినేటి మాధవ రెడ్డి పేరు తీసుకు వచ్చారని, మాధవరెడ్డి, వంగవీటి రంగాల హత్యకేసుల గురించి చర్చించాలని అన్నారని, కానీ చంద్రబాబు అసెంబ్లీలో హైడ్రామా సృష్టించారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

తన కుటుంబంపై తానే బురద చల్లుకుంటున్న చంద్రబాబు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్

తన కుటుంబంపై తానే బురద చల్లుకుంటున్న చంద్రబాబు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఇదిలా ఉంటే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే అవకాశం లేదని, అసెంబ్లీలో, మీడియా సమావేశంలో చంద్రబాబు చేసింది అంతా డ్రామా అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన కుటుంబం పై తానే బురద చల్లుకుంటున్నారు అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దొంగ ఏడుపులు ప్రజలు నమ్మరని, చంద్రబాబు పనైపోయిందని, అసెంబ్లీకి ఆ విషయం చంద్రబాబే చెప్పారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సానుభూతి కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

English summary
Minister Balineni srinivas reddy said that Bhuvaneshwari was like a sister to them and that Jagan would not tolerate women humilation. Minister Anil Kumar Yadav said that Chandrababu did high drama and sprinkled mud on the family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X