Ysrcp amalapuram: మంత్రి అనుచరులే మంత్రి ఇంటిపై దాడిచేశారా??
ప్రశాంతతకు మారుపేరు కోనసీమ. పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే పచ్చటి సీమ భగ్గుమంది. దాడులు చేసినవారు.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టినవారెవరో వీడియో రికార్డుల్లో స్పష్టంగా కనపడుతున్నారు. వీరెవరో గుర్తించాల్సి ఉంది. పోలీసులు కూడా ఈ అల్లర్లలో బయటివారెవరూ పాల్గొనలేదని చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలాల్చిన విషయం ఏమిటంటే దాడులకు పాల్పడినవారు ఎవరు? వారిని ప్రోత్సహించి ముందుకు పంపింది ఎవరు? ఈ విషయాలను ముందుగా తేల్చాలని తెలుగుదేశం, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అల్లర్ల వెనక తెలుగుదేశం, జనసేన: హోంమంత్రి
అల్లర్లు జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర హోం మంత్రి వీటివెనక తెలుగుదేశం, జనసేన ఉన్నాయని ప్రకటించారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా నిందితులెవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ వారిని పట్టుకోవడంలోనే మెలిక ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా? లేదంటే అప్పటికప్పుడు జరిగిందా? అనే విశ్లేషణపై పోలీసుల దర్యాప్తు ఆధారపడుతుందంటున్నారు.

సోషల్ మీడియాలో అల్లర్లకు పాల్పడినవారి వీడియోలు, పొటోలు
అల్లర్లకు
పాల్పడినవారి
ఫొటోలు,
వీడియోలు
సోషల్
మీడియాలో
అందరికీ
చేరుతున్నాయి.
వీరంతా
మంత్రి
విశ్వరూప్
అనుచరులని
అమలాపురం
తెలుగుదేశం
పార్టీ
నేతలు
చెబుతున్నారు.
ఆయన
అనుచరులైనప్పడు
ఆయన
ఇంటిపై
దాడిచేయాల్సిన
అవసరం
ఏమిటని
అందరూ
ఆశ్చర్యపోతున్నారు.
ఇదంతా
ఒక
పథకం
ప్రకారం
జరిగిన
రాజకీయ
కుట్ర
అని
తెలుగుదేశం,
జనసేన
వర్గాలు
ఆరోపిస్తున్నాయ.

వేరేవారిని అరెస్ట్ చేస్తే రాజకీయ రగడే!!
ఒకవేళ
అదే
నిజమైతే
పోలీసులు
నిందితుల్ని
అరెస్ట్
చేయాలి.
అలా
కాకుండా
వేరేవారినెవరినైనా
అరెస్ట్
చేస్తే
మళ్ల
రాజకీయ
రగడ
రాజుకునే
ప్రమాదముంది.
దాడులకు
పాల్పడినవారిపై
కఠినచర్యలు
తీసుకోవాలని
పోలీసులు
యోచిస్తున్నారు.
అలా
తీసుకోకపోతే
అల్లరిమూకలు
మరింత
రెచ్చిపోయే
ప్రమాదముందని
భావిస్తున్నారు.
తుదపరి
చర్య
ఏం
తీసుకుంటారా?
అనే
ఉత్కంఠ
రాష్ట్ర
ప్రజల్లో
నెలకొంది.