వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా - అంబటికి అదనపు బాధ్యతలు : "గుడివాడ" కేంద్రంగా - 2024 ఎన్నికలే లక్ష్యంగా..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు మంత్రులయ్యారు. మూడేళ్ల నిరీక్షణ తరువాత చివరి నిమిషంలో వారికి మంత్రి పదవులు దక్కాయి. సీఎం జగన్ 2024 ఎన్నికల కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11 మంది పాత మంత్రులు..14 మంది కొత్త వారితో కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులకు శాఖల సైతం అప్పగించారు. అయితే, ఈ సారి కేబినెట్ లో రోజా..అంబటి రాంబాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కొత్త మంత్రులకు అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు.

మాజీ కొడాలి నాని - తాజాగా రోజా

మాజీ కొడాలి నాని - తాజాగా రోజా

టీడీపీ - పవన్ కళ్యాణ్ పైన వారిద్దరూ చేసే విమర్శలు - పంచ్ లకు వైసీపీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కేబినెట్ లో టీడీపీ పైన కొడాలి నాని - పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పేర్ని నాని.. మంత్రి అనిల్ కుమార్ లు అసెంబ్లీలో - బయటా తమ వాయిస్ బలంగా వినిపించే వారు. ఇక, అసెంబ్లీకి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. తనను అసెంబ్లీలో చూడకూడదని చంద్రబాబు భావించారని..అటువంటి వ్యక్తి ముందే రెండు సార్లు శాసనసభకు వచ్చానని రోజా పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇక, ఇప్పుడు తాను మంత్రి అయినా..చంద్రబాబు సభలో లేకపోవటం పైనా ప్రస్తావిస్తున్నారు. అయితే..ఇప్పటికే ఏపీలో రాజకీయంగా వాతావరణం హీటెక్కుతోంది.

రంగంలోకి దిగిన సీఎం జగన్

రంగంలోకి దిగిన సీఎం జగన్

సీఎం జగన్ సైతం రంగంలోకి దిగారు. చంద్రబాబు - ఆయన దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా విమర్శలు ప్రారంభించారు. ఇదే సమయంలో పవన్ సైతం తనను దత్తపుత్రుడు అని పిలిస్తే...సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక,కొడాలి నాని సభలో టీడీపీ పైన పోషించిన పాత్ర ఇక రోజా తీసుకోనున్నారు. అదే విధంగా అంబటి రాంబాబు తన దైన శైలిలో చంద్రబాబు -టీడీపీ నేతలను కార్నర్ చేసే బాధ్యతలకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్ లో ప్రభుత్వం పైన ప్రతిపక్షాల విమర్శాలను తిప్పి కొట్టే బాధ్యతలను ప్రధానంగా రోజా - అంబటి రాంబాబు తో పాటుగా గుడివాడ అమర్నాధ్ తీసుకోనున్నారు. ఇప్పటికే మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే గుడివాడ అమర్నాధ్ జనసేన అధినేత పైన రాజకీయంగా గురి పెట్టారు. ఇక, నుంచి పేర్ని నాని బాధ్యతలు జనసేన విషయంలో గుడివాడ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

విశాఖ పై పవన్ - జనసేన పై గుడివాడ

విశాఖ పై పవన్ - జనసేన పై గుడివాడ

గత ఎన్నికల్లో భీమవరం - గాజువాక నుంచి పోటీ చేసిన ఓడిన పవన్ ..ఈ సారి విశాఖ నగరం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో..ముందు నుంచే వైసీపీ అలర్ట్ అవుతోంది. అదే విధంగా గోదావరి జిల్లాల్లోనూ పార్టీ ఫైర్ టీంను సిద్దం చేస్తోంది. మంత్రుల నియమాకం..శాఖల కేటాయింపు పూర్తి కావటంతో..ఇప్పుడు సీఎం జగన్ పార్టీ పరంగా బాధ్యతల కేటాయింపు పైన ఫోకస్ చేసారు. పార్టీ పదవుల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. దీంతో.. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతలకు కీలక బాధ్యతలు కేటాయించనున్నారు. ఇటు పార్టీలో కేడర్ ను యాక్టివ్ చేస్తూనే..అటు ప్రతిపక్షాలకు ధీటుగా చెప్పేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రీజియన్లు - జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.

టార్గెట్ 2024- ఎక్కడా తగ్గద్దంటూ

టార్గెట్ 2024- ఎక్కడా తగ్గద్దంటూ

ఈ సారి ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖ - విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, క్రిష్ణా - గుంటూరు జిల్లా రాజకీయాలు రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నానని వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. పార్టీ పరంగా ఈ జిల్లాలను సీనియర్ - సౌండ్ నేతలకు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. అదే విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాల విషయంలో ఇక నుంచి ఏ మాత్రం ఉపేక్షించటానికి వీళ్లేదని మంత్రులకు స్పష్టమైన సూచనలు అందుతున్నాయి. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్లు - ఎన్ కౌంటర్లతో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Ministers Roja and Ambati Rambabu have been given the tasks to target TDP while Gudivada amar has been asked to target Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X