వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటఆంధ్రప్రదేశ్‌కొత్త పీఆర్సీపై వివాదం కొనలు జాగ్రత్త, పర్యావసానాలు తప్పవు : ఉద్యోగులకు మంత్రి బొత్స వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కొత్త పీఆర్సీపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులు తమ ఆందోళనకు మరింత ఉద్ధృతం చేశారు. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉద్యోగులు మధ్య చీలక తెచ్చేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అయితే సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిపై ఉద్యోగులు విమర్శలు చేయడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.

Recommended Video

PRC Issue In AP: సమ్మె వద్దు.. చర్చించుకుందాం AP Govt VS Employees | Oneindia Telugu
సీఎం జ‌గ‌న్‌పై దుర్భాష‌ల‌కు ప‌ర్యవ‌సానాలు త‌ప్ప‌వు..

సీఎం జ‌గ‌న్‌పై దుర్భాష‌ల‌కు ప‌ర్యవ‌సానాలు త‌ప్ప‌వు..

రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారు సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిని దుర్భాషలాడుతూ మాట్లాడే మాటలకు, విమర్శలకు ఉద్యోగ సంఘాల నేతలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పర్యవసానాలు తీవ్రంగా, ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులులా తాము మాట్లాడలేక కాదు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నామన్నారు. వారి పట్ల తాము ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు కూడా హుందాగా మాట్లాడాలని సూచించారు.

కొత్త పీఆర్సీ ప్రకార‌మే వేత‌నాలు

కొత్త పీఆర్సీ ప్రకార‌మే వేత‌నాలు


రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై విశ్వాసం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లిస్తామని స్ప‌ష్టం చేశారు. ఒకటో తేదినే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొత్త పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క సారి జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే వేతనాలు వస్తాయని స్పష్టం చేశారు.

 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా..

ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా..

కొత్త పీఆర్సీ జీవో ప్రకారమే ఉద్యోగులకు ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ ,డీఏలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా వారినుంచి స్పందన లేదని పేర్కొన్నారు. వారి కోసం మంత్రుల కమిటీ మూడు రోజుల పాటు ఎదురు చూసిందని తెలిపారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం తెలియకుండా మంత్రుల కమిటీ ఎలా సిపార్సులు చేస్తుందని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రభుత్వ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్‌ల‌ను వినిపించాలని కోరారు. అంతే కాని గొంతెమ్మ కోరికలు కాదన్నారు.ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంద‌న్నారు.

English summary
Salaries for employees as per new PRC .. Minister Botsa Satyanarayana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X