చంద్రబాబు రోడ్ షోలో అగ్నిప్రమాదం- మంటలు అంటుకున్నా స్పీచ్ కంటిన్యూ

కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తొలుత కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించారు. రోడ్ షోల్లో ప్రసంగించారు. ఇవ్వాళ కడప జిల్లాలో అడుగుపెట్టారు. నంద్యాల మీదుగా ఆయన కడప జిల్లాలో ఎంట్రీ ఇచ్చారు. జిల్లాలోని జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు.

రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిపోయిందనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యాటనను చేపట్టారు. ప్రాజెక్టులను సందర్శించడానికి ఈ పర్యటనను తలపెట్టారు. పెన్నా టు వంశధార పేరుతో దీన్ని నిర్వహిస్తోన్నారు. నందికొట్కూరులో ముచ్చుమర్రి - బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. రోడ్‌ షోలో పాల్గొన్నారు.

chandrababunaiduspeetch

అనంతరం ఈ ఉదయం ఆయన నంద్యాల, కోవెలకుంట్ల మీదుగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చేరుకున్నారు. రోడ్ షోలో భాగంగా జమ్మమడుగు టౌన్‌లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ తీవ్ర వివక్షకు గురైందని, నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిందని ఆరోపించారు. నీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనీ విమర్శిచారాయన. పోలవరాన్ని తామే ప్రారంభించామని, మళ్లీ తామే పూర్తి చేసి తీరుతామనీ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కాగా- చంద్రబాబు ప్రసంగిస్తోన్న సమయంలో స్వల్పంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆయన ఉన్న వాహనానికి వెనుకలే ఉన్న ఓ తోపుడు బండి మంటలకు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుడొకరు ఈ తోపుడు బండిపై చిన్న హోటల్‌ను నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చడం వల్ల నిప్పురవ్వలు పడి ఆ తోపుడుబండి దగ్ధమైందని చెబుతున్నారు.

చంద్రబాబు రాక సందర్భంగా నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, ఇష్టానుసారంగా పటాకులు కాల్చారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తోన్నారు. నిప్పురవ్వలు పడి తోపుడు బండి మంటల్లో కాలిపోతున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం తన ప్రసంగాన్ని మానలేదంటూ ధ్వజమెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+