కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ఊహించని సంఘటన..
విశాఖపట్నం వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లో ఊహించని సంఘటన జరిగింది. ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉండగా వారికి మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి, తన భర్త జానకిరామ్ తో కలిసి విశాఖ వెళ్లేందుకు ఇచ్ఛాపురంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.
అయితే ట్రైన్ ప్రయాణిస్తున్న సమయంలో భూలక్ష్మికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త జానకి రామ్ ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అయితే వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. రైలు శ్రీకాకుళం స్టేషన్ రాగానే నిలిపివేసింది. అప్పటికే స్టేషన్ కు చేరుకున్న వైద్యురాలు పల్లవి కీర్తి.. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రైలులోనే ప్రసవం చేశారు.

దీంతో రైలులోనే ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం తల్లి, పిల్లలను రాగోలు జీఏఎంఎస్‌కు తరలించారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది, వైద్యురాలు, శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications