వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయతతోనే మిస్ అమెరికాగా, సినిమాలు వద్దు: నీనా దవులూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించడం వల్లనే తాను ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగానని మిస్ అమెరికా నీనా దవులూరి అన్నారు. తన జీవితంలో 2014వ సంవత్సరం ప్రత్యేకమని ఆమె వ్యాఖ్యానించారు. దానికి కారణం ఈ ఏడాదిలో తాను మిస్ అమెరికాగా ఎన్నిక కావడమే అన్నారు.

ఏడాది కాలంలో తాను వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నానని చెప్పారు. మిస్ అమెరికాగా ఎన్నిక చేసిన సంస్థ లక్ష్యం కూడా అదేనని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఎంబీటే పూర్తి చేస్తానని చెప్పారు. సమాజ సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

Miss America 2014 Nina Davuluri credits Indian roots for the title

తనకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఆమె అన్నారు. మిస్ యూనివర్స్, మిస్ అమెరికా వంటి పోటీలలో విజేతలకు సినిమా అవకాశాలు వస్తాయి కదా.. మీకు వచ్చాయా అని విలేకరులు ఆమెను అడిగారు. దానికి పైవిధంగా స్పందించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

కాగా, గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన నీనా దవులూరి... తనకు హీరో ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పింది. వర్షం సినిమా చూసి ప్రభాస్‌ అభిమానిగా మారిందట. 'వర్షం' సినిమా చూసి ప్రభాస్ అభిమానిని అయ్యానని 2007లో భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

నీనా దావులూరి తల్లిదండ్రులు దావులూరి కోటేశ్వరరావు చౌదరి, షీలారంజని. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ. నీనా తండ్రి కోటేశ్వరరావు గైనకాలజిస్ట్. వృత్తిరీత్యా 1981లో ఆయన అమెరికాలోని మిస్సోరీకి చేరుకున్నారు. 1989, ఏప్రిల్ 20న నీనా సెరీక్యూజ్‌లో జన్మించింది. ఆమె సోదరి పేరు మీనా. నాలుగేళ్ల వయసులో వీరి కుటుంబం ఒక్లహామాకు, మిషిగాన్‌కు మారింది. నీనా కాలేజీ చదువు మిషిగాన్‌లోనే సాగింది.

English summary
Miss America 2014 Nina Davuluri on Saturday said Indian culture helped her to win the coveted beauty title. She was in Vijayawada to visit her extended family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X