దేవినేని ఇంట్లో రాత్రిపూట కలకలం: మిస్ ఫైర్, పరుగు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఇంట్లో శనివారం నాడు మిస్ ఫైర్ అయింది. ఎస్కార్ట్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో దేవినేని ఇంట్లోని కుటుంబ సభ్యులు పరుగులు పెట్టారు.
ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ ఎస్కార్ట్‌గా ఉన్నారు. ఆ సమయంలో మంత్రి దేవినేని ఇంట్లో లేరు. కుటుంబ సభ్యులు అందరు భోజనం కోసం సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ దూసుకు వచ్చిన ధ్వని వచ్చింది.

అయితే, ఆ బుల్లెట్ ఇంటి పైకప్పులోకి దూసుకు వెళ్లింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. వారు పరుగులు పెట్టారు. తూటా వరండాలోని శ్లాబ్‌కు తగిలింది. శ్లాబ్ పై పెచ్చు ఊడిపోయింది. అనంతరం విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications