ఏపీలో మిస్సయిన అన్నదమ్ములు.. వారణాసిలో ఆత్మహత్య!
ఏపీలో మిస్సయిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్న ఘనట సంచలనంగా మారింది. వారణాసిలోని ఓ ఆశ్రమంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనే వీరు కనిపించడం లేదని ఏపీలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంకు చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32) ఈ ఏడాది మే నెల నుంచి కనిపించకుండా పోయారు. దీంతో బంధువులు తెలిసినవాళ్ల ఇళ్లతోపాటు స్నేహితులను విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే నెలలో బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయింది. వీరిద్దరూ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారంతోపాటు రియల్ ఎస్టేట్ చేసేవారు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోవడం అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసు విషయమై పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

గదిని అద్దెకు తీసుకుని..
అయితే, తాజా సమాచారం మేరకు.. వీరిద్దరూ వారణాసిలోని ఓ హిందు ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని అందులో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు వారణాసి పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు మృతదేహాలను స్వస్థలానకి తలరించేందుకు వారణాసి బయలుదేరారు. మృతులు ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని.. దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోనున్నామని సెల్ఫీ వీడియోలు పంపినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఆత్మహత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications