సంసిద్ధత: అమరావతిలో జపాన్ ప్రాచీన బ్యాంకు 'మిజుహో' శాఖ
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతికి జపాన్ ప్రాచీన బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన మిజుహో బ్యాంకు రానుంది. ఈ మేరకు జపాన్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఆ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో బ్యాంకు శాఖను ప్రారంభించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
జపాన్‌లో అత్యంత ప్రాచీనమైన బ్యాంకుగానే కాకా అ దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా మిజుహోకు పేరు ప్రఖ్యాతులున్నాయి. చంద్రబాబు భేటీలో నూతన రాజధాని అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై మిజుహో బ్యాంకు ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.

అంతక ముందు ఏపీలో 20 గిగా వాట్లతో సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన సాప్ట్ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సాఫ్ట్ బ్యాంకు ఛైర్మన్ మసయోషిసోన్‌తో చంద్రబాబు బృందం భేటీ అయింది.
జపాన్ ఆర్థికశాఖ మంత్రి యోచి మియాజావాతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జపాన్‌తో సుదీర్ఘ సంబంధాలు కోరుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. భారత్ జపాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications