చూస్తూ ఊరుకోం, పాదయాత్ర కూడా చేయలేరు: వర్మ, జగన్‌పై అనిత సంచలనం

Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ జీవితంపై రూపొందిస్తున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' అప్పుడే వివాదాలకు తెరతీసింది. ఆయన సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నేటి వరకూ వర్మపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే.

వక్రీకరించొద్దు..

వక్రీకరించొద్దు..

తాజాగా, అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దని సూచించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్ ఐతే హీరో మీరే | Oneindia Telugu
చూస్తూ ఊరుకోరు..

చూస్తూ ఊరుకోరు..

ఎన్టీఆర్ మహానుభావుడు.. ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలని కోరారు. ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని అనిత హెచ్చరించారు.

జగన్‌పై పైనా సినిమా...

జగన్‌పై పైనా సినిమా...

రాజకీయంగా సీఎం చంద్రబాబును ఎదుర్కోలేకే.. వైసీపీ నేతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నట్లు ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే బ్రతికి ఉన్న వైయస్ జగన్‌పై కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారని అనిత స్పష్టం చేశారు.

జగన్ పాదయాత్ర కూడా చేయలేరు..

జగన్ పాదయాత్ర కూడా చేయలేరు..

జగన్ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరని ఎద్దేవా చేశారు. మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలనే, అదే సమజాహితమని అనిత హితవు పలికారు. అయితే, ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని వర్మ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP MLA Vangalapudi Anitha on Thursday fired at Ram Gopal Varma and YSRCP presideng YS Jaganmohan Reddy for Lakshmi's NTR movie.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి