అనిల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి "జాతర" - బావా కాకాణి..మర్చిపోవద్దు..!!
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లక్ష్యంగా మాట్లాడారు. బావా కాకాణి..అంటూనే తాను చెప్పదలచుకున్నది చెప్పారు. మౌనంగా నిష్క్రమిద్దాం అనుకుంటే అందరూ తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనను బూరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. తన పైన కిడ్నాప్ కేసు కాదని..హత్యాయత్నం కేసు నమోదు చేసుకోవాలని..అన్నింటికి సిద్దపడే ఉన్నానని స్పష్టం చేసారు. ఆనం ను మంత్రి కాకాణి వేధించారని కోటంరెడి ఆరోపించారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీబీఐ కేసు గురించి చూసుకోవాలని కోటంరెడ్డి సూచించారు. తన పైన కేసులు పెడతామని లీకులు ఇస్తున్నారని..వాటితో తాను భయపడతానని అనుకోవద్దన్నారు. గతంలో ఆనం నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ గా కాకాణి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారని..ఇప్పుడు అదే ఆనం తో మంత్రి కాకాణి విభేదించకూడదు కదా అని ప్రశ్నించారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాకాణి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. వైఎస్ విగ్రహం ఏర్పాటు అడ్డుకున్నారని చెప్పారు. చంద్రబాబుకు పాదాభివనందం చేయలేదా అని నిలదీసారు. అవన్నీ కాకాణి మర్చిపోవద్దని పేర్కొన్నారు. కాకాణి కోర్టు కేసు వ్యవహారంలో తప్పు చేసారని తాను అనటం లేదని..సీబీఐ విచారణ సాగుతున్న వేళ ఆ కేసు గురించి చూసుకోమని మాత్రమే చెబుతున్నానన్నారు.

టీడీపీలో తనకు అవకాశం వస్తుందో రాదో చూద్దామని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి భారీగా ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు తాను పార్టీతో విభేదించటంతో తనతో ఉన్న కార్పోరేటర్లు..నేతలకు మంత్రులు ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా.. కార్పోరేటర్ విజయ్ భాస్కర్ ను తాను కలిసానని..మాట్లాడానని..ఆయన తనను హత్తుకున్నారని వివరించారు. కాసేపటికే తన ప్లెక్సీలు తీసేసి..కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. ఇక..ఇరుకళలమ్మ జాతర నలభై ఏళ్ల తరువాత నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా నెల్లూరు రూరల్ - అర్బన్ నియోజకవర్గాల్లో జాతర నిర్వహించి తీరుతామని స్పష్టం చేసారు. రెండు నియోజకవర్గాల్లో ప్రతీ దేవస్థానం..ప్రతీ వాడకు వెళ్తానని స్పష్టం చేసారు. ఇప్పుడు దీని పైన అనిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications