Viral Video:మన రాజధాని ఏది...సార్ - వైసీపీ ఎమ్మెల్యేకు ఇరకాటం..!!
రాజధాని పై వైసీపీ ఎమ్మెల్యేలకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. మన రాజధాని ఏది..సార్ అంటూ వేసిన ప్రశ్నతో ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారు. స్థానికుడి ప్రశ్నతో ఒక దశలో ఎమ్మెల్యే సహనం కోల్పోయారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో పర్యటించినప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరల్ గా మారింది.
మన రాజధాని ఏదండీ అంటూ కొడవటికల్లు గ్రామస్థుడు వేసిన ప్రశ్నతో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఇబ్బంది పడ్డారు. గ్రామస్ధుడు ఎమ్మెల్యేతో రాజధాని ఏదని ప్రశ్నించగా..మూడు అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఏవేవండీ అంటూ తిరిగి స్థానికుడు ప్రశ్నించారు. దీనికి మీకు తెలియదా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలియదని, అందుకే అడుగుతున్నానంటూ స్థానికుడు తన ప్రశ్నలు కొనసాగించారు. తెలియనప్పుడు అడగకూడదంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాను తెలుసుకోవాలనే అడిగానని రవీంద్రబాబు సమాధానమిచ్చారు. తెలుసుకోవద్దు..అసలు మీకు తెలియకపోతే వదిలేయాని ఎమ్మెల్యే ఒకింత అసహనం వ్యక్తం చేసారు.

దీనికి కొనసాగింపుగా..రాజధానులు ప్రభుత్వ నిర్ణయమని చెప్పేసి.. అక్కడినుంచి కదలబోయారు. మరోసారి రవీంద్రబాబు.. ఆయనకు ప్రశ్నలు వేశారు. ఎన్నికలకు ముందు సుబాబుల్‌కు రూ.5 ఐదు వేలు ఇప్పిస్తామంటూ మీరు పాదయాత్ర చేశారు కదా..అని అడగ్గా, గత ప్రభుత్వంపై నెపాన్ని వేస్తూ మాట్లాడారు. వారు నాశనం చేస్తే ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. సుబాబుల్ సమస్యకు సమాధానం చెప్పలేకపోయిన మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు..అని రవీంద్రబాబు చెప్పేశారు. తాను ఎక్కడికైనా వస్తానంటూ ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. ఈ వాదన సమయంలో పార్టీ నేతలు జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే వారిని వారించారు. దీంతో, పోలీసులు గ్రామస్థుడికి సర్ది చెప్పారు. ఎమ్మెల్యే తన కార్యక్రమం కొనసాగించారు.
మన రాజధాని ఏది సర్? వైసీపీ ఎమ్మెల్యేకు షాక్..!#YSRCPMLA #AndhraPradesh #ApCapital #AmaravatiCapital #VizagCapital #YSRCP #Oneindiatelugu pic.twitter.com/Q1cuU9p55W
— oneindiatelugu (@oneindiatelugu) April 14, 2023












Click it and Unblock the Notifications