వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ మారితే అవినీతిపరులా: జగన్-సాక్షికి వైసిపి ఎమ్మెల్యే సూటి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాను పార్టీ మారగానే అవినీతిపరుడిని అయ్యానా? అని ఎమ్మెల్యే సర్వేశ్వర రావు మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, జగన్ మీడియా సాక్షి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాపై పావులు, ఎవరికి షాక్?: 'కాంగ్రెస్' కేవీపీకి బాబు కౌంటర్

సాక్షి మీడియాలో తన పైన అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాను వైసిపిలో ఉన్నంత కాలం నీతిమంతుడిని, ఇప్పుడు టిడిపిలో చేరగానే అవినీతిపరుడిని ఎలా అయ్యానో చెప్పాలని నిలదీశారు. తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్నందున జగన్ పైన అట్రాసిటీ కేసు పెడతానని హెచ్చరించారు.

MLA questions YS Jagan for defaming his image

కాగా, గత కొద్ది నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది వరకు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టిడిపిలో చేరిన వారి నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయాలను వైసిపి చూసుకుంది. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నారు.

2014 ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచి, ఇప్పుడు టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కోర్టులకు వెళ్లింది. కోర్టులలో ఆ పార్టీకి ఒకింత చుక్కెదురైంది. పార్టీ మారిన వారి పైన కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ పార్లమెంటులో పట్టుబడతామని చెప్పింది.

తప్పుగా రాస్తే: జగన్‌కు బాబు, నేను చెప్పినా ఇంతేనా.. ఆగ్రహం

ఇదిలా ఉండగా, సదావర్తి భూముల విషయంలో కొన్ని పత్రికల్లో బాధ్యతారహితంగా వార్తలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సదావర్తి సత్రం భూముల కథనాల విషయంలో ఓ పత్రికకు నోటీసులు ఇస్తామని వెల్లడించారు. ఆ పత్రిక సాక్షియేనని అందరు భావిస్తున్నారు.

English summary
MLA Sarveswara Rao questions YSRCP chief YS Jaganmohan Reddy for defaming his image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X