వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుప్పును, పప్పును కుప్పంలో ప్రజలు తరిమి కొడతారు; లోకేష్ ఆరిపోయే దీపం: తూర్పారబట్టిన ఎమ్మెల్యే రోజా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన రోజా లోకేష్ ఆరిపోయే దీపం అని, చంద్రబాబు లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న విషయం గుర్తుకు వస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో వైసీపీ కోసం వాలంటీర్లు, ఉద్యోగులు .. ఆధారాలతో సహా ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుఎన్నికల ప్రచారంలో వైసీపీ కోసం వాలంటీర్లు, ఉద్యోగులు .. ఆధారాలతో సహా ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

లోకేష్ ఒక వీధి రౌడీ .. టీడీపీ ని టార్గెట్ చేసిన రోజా

లోకేష్ ఒక వీధి రౌడీ .. టీడీపీ ని టార్గెట్ చేసిన రోజా

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోకేష్ ఒక వీధి రౌడి మాదిరిగా మాట్లాడుతున్నాడని చురకలంటించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పట్టని చంద్రబాబు, లోకేష్ ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని నగరి ఎమ్మెల్యే రోజా నిలదీశారు. గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కారని, ఇక మునిసిపల్ ఎన్నికలలో మురుగు కాలువల్లో ముంచి తీశారని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తరిమితరిమి కొట్టారని అయినా టిడిపి నేతలకు సిగ్గు రాలేదని రోజా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

 కుప్పంలోనూ చంద్రబాబును రాజకీయ సమాధి చేసేందుకే లోకేష్ సవాళ్ళు

కుప్పంలోనూ చంద్రబాబును రాజకీయ సమాధి చేసేందుకే లోకేష్ సవాళ్ళు

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు కనీసం అక్కడి ప్రజలకు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామని కుప్పం ప్రజల ఆలోచన చేస్తున్నారంటూ రోజా తెలిపారు. కుప్పంలో లోకేష్ మాట్లాడిన మాటలు ,సవాళ్ళు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న రోజా కుప్పంలోనూ చంద్రబాబును రాజకీయ సమాధి చేసేందుకే ఇలాంటి సవాళ్ళు విసురుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారు

కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారు

చంద్రబాబు ఏ రోజు కుప్పం ప్రజలకు అందుబాటులో లేరని, పద్నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు అని రోజా ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ కుప్పం ప్రజలను గాలికొదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారు అంటూ రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసిపి మీద గెలవలేక తప్పుడు ప్రచారాలకు టిడిపి నేతలు తెగబడ్డారు అని విమర్శించారు.

 రాసుకోవడానికి చరిత్ర, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండవు

రాసుకోవడానికి చరిత్ర, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండవు

అధికారులపై దాడులకు పాల్పడడం, ఎన్నికల్లో మద్యం డబ్బు పంచి దౌర్జన్యాలకు దిగి వైసిపి గెలిచే ప్రయత్నం చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని, వైసిపి అరాచకాలు చేస్తుందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపణలు గుప్పించారు. కుప్పం ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని తరిమి కొడతారని తండ్రి కొడుకులు ఎన్ని ఆటలాడినా కుప్పం ఎన్నికల తరువాత రాసుకోవడానికి చరిత్ర, చూసుకోవడానికి భవిష్యత్తు లోకేష్ చంద్రబాబులకు ఉండదని ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు.

 కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం


ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ప్రతి ఎన్నికలలో వైసీపీకి పట్టం కడుతున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం వైసీపీ హయాంలో అభివృద్ధి చెందిందని రోజా పేర్కొన్నారు. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో, పంచాయతీ, ఎంపీటీసీ జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఏవైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తున్నారని, ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయమని రోజా స్పష్టం చేశారు.

English summary
MLA Roja made shocking comments on Chandrababu and Lokesh. MLA Roja said Kuppam people would not vote for tdp in the elections. Roja fires on lokesh comments in kuppam election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X