బ్లాక్‌లో టిటిడి దర్శనం టికెట్లు అమ్ముతున్న ఎమ్మెల్యే పిఎ
తిరుపతి: శాసనసభ్యుడి లెటర్ హెడ్‌ను దుర్వినియోగం చేస్తూ తిరుమల బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవా టికెట్లు అమ్ముతున్న కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిఎను తిరుమల పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు.
శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శనానికి వచ్చిన శాసనసభ్యుడు సైతం తన పిఎ వ్యవహారంతో ఇబ్బందికి గురయ్యారు. టికెట్ల మీద ఉన్న పేర్లతో శాసనసభ్యుడితో వచ్చిన ఆయన బంధువుల పేర్లు సరిపోలకపోవడంతో వారిని టిటిడి సిబ్బంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతిని నిరాకరించారు.

దాంతో శాసనసభ్యుడు పిఎను విషయమేమిటనే అడిగారు. ఆ టికెట్లు మరొకరికి అమ్మినట్లు పిఎ చెప్పాడు. మోహన్ రెడ్డి ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీసులు శాసనసభ్యుడి పిఎ శ్రీనివాసులును కస్టడీలోకి తీసుకున్నారు.
అతను నాలుగు టికెట్లను 17 వేల రూపాయలకు, రెండు సుప్రభాతం సేవా టికెట్లు ఐదు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. అదే విధంగా జనవరి 22వ తేదీన తిరుపతి ఎంపి వి వరప్రసాద రావు లెటర్ హెడ్స్‌ను హరి అనే వ్యక్తి దుర్వినియోగం చేశాడు.












Click it and Unblock the Notifications