రేసింగ్: ఎమ్మెల్యే కొడుకుని పట్టుకుని వదిలేశారు

పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి పునరావృతం అయితే కేసులు పెడతామని హెచ్చరించి విడిపిపెట్టారు. యువకులు ఆదివారం ఉదయం బైక్‌లతో కాజాకు చేరుకున్నారు. స్థానికులపై ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బైండింగ్ ఓవర్ కూడా తీసుకోకుండా యువకులను వదిలేయడం విమర్శలకు తావు ఇస్తోంది. వారి చిరునామాలను మాత్రం తీసుకున్నారు. అయితే, బైండోవర్ చేయలేదనే విమర్శలను గుంటూరు డిఎస్పీ మధుసూదన రావు ఖండించారు.
పోలీసులను చూసిన తర్వాత యువకులు కదలలేదని, పైగా వారితో వివాదానికి దిగారని అంటున్నారు. యువకుల నుంచి పోలీసులు కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వాహనాలను తిరిగి ఇప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications