దుర్మార్గుడ్ని పరామర్శించటానికి జైలుకెళ్ళిన జగన్ వార్నింగ్ లు ఇస్తాడా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలను టిడిపి నేతలు తిప్పి కొడుతున్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జైలుకు వెళ్లి జగన్ వార్నింగ్ ఇస్తాడా?
జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి జైలుకు వెళ్లి కులాల గురించి మాట్లాడుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీ నాయకులు కూడా సమర్ధించడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి ఎవరికి వార్నింగ్ ఇస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

MLA Somireddy chandramohan reddy shocking counter to ys jagan

దుర్మార్గాలు చేసిన వంశీని జగన్ పరామర్శిస్తాడా?
వల్లభనేని వంశీ అనే వాడు ఒక దుర్మార్గుడు అని, మనిషి పుట్టుక పుట్టిన వాడు చేయని దుర్మార్గాలను వంశీ చేశాడని అటువంటి వాడిని జగన్ పరామర్శించాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గురించి, జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల గురించి విమర్శలు చేసిన వర్రా రవీంద్రారెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడని, జగన్ వాళ్ళని కూడా వెళ్లి పరామర్శిస్తాడా అంటూ ప్రశ్నించారు.

జగన్ లాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నవాడిని చూడలేదు
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి, ఎన్నో దారుణాలకు పాల్పడిన వల్లభనేని వంశీని జగన్ వెళ్లి పరామర్శించడం దారుణం అన్నారు. సమాజంలో ఎంతో మంది నాయకులను ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ వంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిని మాత్రం తాను చూడలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ నిజస్వరూపం బయట పెట్టుకున్నాడు
దుర్మార్గుడిని పరామర్శించిందే కాకుండా కులాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి జగన్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నేడు వల్లభనేని వంశీని పరామర్శించటం కోసం జైలుకు వెళ్ళిన జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్యాయం చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, మళ్ళీ అధికారంలోకి వచ్చాక
బట్టలూడదీసి నిలబెడతాం అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+