బెదిరింపు: టిడిపి ఎమ్మెల్యేపై పోలీసులకు భార్య ఫిర్యాదు

MLA wifes complaints against husband
హైదరాబాద్: కృష్ణా జిల్లా కైకలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పైన ఆయన భార్య సునీత గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన తనను, తన పిల్లలను బెదిరిస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు, తన పిల్లలకు భర్త నుండి ప్రాణహానీ ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆమె పెనమలూరు పోలీసులను కోరారు. తనను చంపుతానని తన భర్త బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో చెప్పారు. తమను మాటలతో వేధించేవారని పిల్లలు కూడా ఆరోపించారు.

కాగా, కుటుంబ కలహాల నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ పైన గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన పైన తొలుత గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.

2012లో భార్యాభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించడంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరు కోర్టుకు హాజరు కాగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించారు.

వెంకటరమణతో తనకు పదిహేనేళ్ల క్రితం వివాహమైందని, పెళ్లినాటి నుంచి ఇబ్బందులు పెట్టినా ఇంతకాలం సహించానని, ఇప్పుడు తనను చంపేస్తానంటూ భర్త బెదిరిస్తున్నాడంటూ ఆమె వాపోయారు. తననెన్ని బాధలు పెట్టినా భరించానని, పిల్లలను కూడా కష్టపెట్టడంతో కంప్లయింట్ ఇవ్వక తప్పని పరిస్థితిలోనే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+