కోటంరెడ్డికి టీడీపీ ఆహ్వానం, ఇక అఫీషియల్ - ఆనంతో కలిసి ఎంట్రీ..!!

తెలుగుదేశం ఆపరేషన్ నెల్లూరు ప్రారంభించింది. ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలు ఇక అఫీషియల్ గా టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. నెల్లూరులో తన ఇంటికి టీడీపీ నేతలను బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు. ఈ రోజు అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. అటు కోటంరెడ్డి ఇంటికి టీడీపీ ముఖ్య నేతలు చేరుకున్నారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఇక..ఈ ఇద్దరి చేరికకు లైన్ క్లియర్ అయింది.

మారుతున్న నెల్లూరు రాజకీయం: వైసీపీ కంచుకోట నెల్లూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నెల్లూరు లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. ముగ్గురినీ వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ ముగ్గురు టీడీపీకి దగ్గరగా ఉంటున్నారు. ఇక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..అధికారికంగా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 13వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానుంది.

MLAs Anam and Kotamreddy likely to join TDP soon, as TDP leaders invites both leaders in Nellore

ఈ సమయంలో పార్టీలో ముఖ్య నేతల చేరికల ద్వారా మరింత జోష్ తీసుకురావాలనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబుతో సమావేశయ్యారు. ఈ రోజు టీడీపీ నేతలను తన ఇంటికి ఆహ్వానించారు. టీడీపీ కార్యలయానికి ఆనం వెళ్లనున్నారు. ఈ రోజు అనుచరులతో సమావేశం తరువాత అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు.

కోటంరెడ్డికి టీడీపీ ఆహ్వానం: ఈ రోజు ఆనం తన అనుచరులతో సమావేశం కానున్నారు. వైసీపీకి రాజీనామా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అటు కోటంరెడ్డి నివాసానికి మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర చేరుకున్నారు. సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఆనంతోనూ టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు. ఇద్దరు నేతలను అధికారికంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఒకటి రెండు రోజుల్లోనే ఈ ఇద్దరు అఫీషియల్ గా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో టీడీపీలో చేరి ఎన్నికలకు సమాయత్తం కావాలనేది ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో పట్టు పెంచుకొనే క్రమంలో భాగంగా టీడీపీ ముందస్తు కసరత్తు ప్రారంభించింది.

ఇద్దరు టీడీపీలోకి ఎంట్రీ: టీడీపీలోకి చేరటం ద్వారా ముందుగా లోకేష్ పాదయాత్రలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఆనం..కోటంరెడ్డికి టీడీపీ జిల్లా నేతల నుంచి మద్దతు లభించేలా లోకేష్ తన పాదయాత్ర సమయంలో జిల్లా నేతలతో సమన్వయం కుదిరేలా ముఖ్య భూమిక పోషించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు నెల్లూరు జిల్లాలో లోకేష్ యాత్ర కొనసాగనుంది.

ఇప్పటికే నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనంకు సీట్లు ఇచ్చే అంశం పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని టీడీపీ నేతల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా లోకేశ్ బాధ్యత తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలోకి చేరటం ఖాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+