ఆనం, మేకపాటి కొత్త సవాల్ - సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ..!!
నెల్లూరు రాజకీయం మారుతోంది. వైసీపీ కంచుకోటలో టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో ఆ ముగ్గురినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఆనం..మేకపాటి టీడీపీ నేత లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు. వైసీపీకి సవాల్ విసురుతున్నారు. సస్పెండ్ చేసినా సాంకేతికంగా పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్న వీరి విషయంలో ఇప్పుడు సీఎం జగన్ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది.
లోకేశ్ యాత్రలో ఆ ఎమ్మెల్యేలు
తాము టీడీపీలో చేరుతున్నట్లుగా నెల్లూరు జిల్లా వైసీసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఆనం తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీలో చేరటం పైన చర్చించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమయ్యారు. టీడీపీ పోలిట్ బ్యూరోలో చర్చించిన తరువాత రాజీనామా పైన నిర్ణయం తీసుకుందామని సూచించారు. ముందుగా లోకేశ్ పాదయాత్ర పైన ఫోకస్ చేయాలని చంద్రబాబు సూచించారు. అదే సమయంలో జిల్లా టీడీపీ నేతల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకుండా.. పార్టీ నేతలనే చంద్రబాబు ముందస్తుగా ఆనం..కోటంరెడ్డి వద్దకు పంపారు. టీడీపీ నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. లోకేశ్ పాదయాత్ర తరువాత తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆనం ప్రకటించారు. మేకపాటి ఇప్పటికే రెండు సార్లు లోకేశ్ ను కలిసారు. కోటంరెడ్డి టీడీపీలో ఎంట్రీకి రంగం సిద్దం చేసకుంటున్నారు.

టీడీపీలో చేరుందుకు సిద్దం:
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో యాత్రకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో తొలి రోజు లోకేశ్ 9 కిలో మీటర్ల యాత్ర సాగింది. ఇప్పుడు సస్పెన్షన్ తో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా టీడీపీ నేతలతో సమావేశాలు..కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ఈ ముగ్గురిని వైసీపీ నాయకత్వం వదులుకుందా.
.లేక ఎన్నికల వేళ ఫిక్స్ చేసే ఆలోచనల దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ మొదలైంది. తాజా సమీకరణాలతో ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆత్మకూరు నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి పోటీ చేయనున్నారు. గతంలోనూ ఆనం ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. సీటు గురించి ఇప్పటికే చంద్రబాబు నుంచి హామీ పొందారు.
సీఎం నిర్ణయాల పై ఆసక్తి:ఇదే సమయంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపైన వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ సవాళ్లు మొదలయ్యాయి. ఇప్పుడు లోకేశ్ యాత్రలో పాల్గొనటం ద్వారా వైసీపీ నాయకత్వానికి వీరి పైన వేటు వేయటానికి పూర్తి ఆధారాలు చిక్కాయి. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలే సమయం ఉండటంతో వారి పైన ఆ దిశగా చర్యలకు వైసీపీ నాయకత్వం ముందుకు వస్తుందా అనేదే సందేహంగా కనిపిస్తోంది.
అదే సమయంలో వీరి పైన చర్యలు తీసుకోవాలని భావిస్తే..టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆ నలుగురి ఎమ్మెల్యే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి స్థానంలో ఉదయగిరికి పార్టీ ఇంఛార్జ్ ను పార్టీ అధికారికంగా ఖరారు చేయలేదు. జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాలినేని తప్పుకోవటంతో ఆ స్థానం భర్తీ చేయాల్సి ఉంది. నెల్లూరు పైన టీడీపీ వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications