పోలింగ్ వేళ సీఎం జగన్ తో శ్రీదేవి - మేకపాటి భేటీలో ఏం జరిగింది..!?
క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపైన వైసీపీ వేటు వేసింది. ఆనం - కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీకి ఓటు వేస్తారని ముందే అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా మరో ఇద్దరు ఆ జాబితాలో చేరారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి - మేకపాటి టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసినట్లుగా నిర్దారించారు.
ఆ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారనేది ముందుగానే గుర్తించారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వారితోనూ చర్చించారు. ఈ ఇద్దరు సీఎంను కలిసారు. అటు టీడీపీకి ఓటు వేసారు. సీఎం ను కలిసిన సమయంలో ఏం జరిగిందీ..టీడీపీ ఎలా ట్రాప్ చేసింది.
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గ వైసీపీలో కొంత కాలంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎమ్మెల్యే శ్రీదేవి పైన స్థానికంగా అసంతృప్తి ఉన్నట్లు పార్టీ గుర్తించింది. అక్కడ నియోజకవర్గ ఇంచార్జ్‌గా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించారు. కొన్ని పరిణామాల ఆధారంగా టికెట్ దక్కదనే అభిప్రాయానికి శ్రీదేవి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. శ్రీదేవి అసంతృప్తితో ఉన్న విషయం గుర్తించిన టీడీపీ మంతనాలు చేసింది. తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. సరిగ్గా పోలింగ్ నాడు శ్రీదేవి తన కుమార్తెతో పాటుగా సీఎం జగన్ ను కలిసారు. సొంత అన్నలాగా తోడుగా ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

కానీ, వచ్చే ఎన్నికల్లో సీటు గురించి మాత్రం చర్చకు రాలేదని చెబుతున్నారు. దీంతో, శ్రీదేవి ఇక తనకు సీటు రాదనే నిర్ణయానికి వచ్చేసారు. టీడీపీ నుంచి భవిష్యత్ పైన హామీ వచ్చిందని ప్రచారం. దీంతో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దికి మద్దతు ఇచ్చారని ప్రచారం సాగుతోంది.మరో ఎమ్మెల్యే మేకపాటి కూడా పోలింగ్ ముందు, ఆ తరువాత సీఎంను కలిసారు. మేకపాటి నియోజకవర్గం ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడిగా ధనుంజయ రెడ్డిని పార్టీ నియమించింది.
అక్కడే మేకపాటి అసంతృప్తికి గురయ్యారు. అధిష్ఠానంతో మేకపాటికి మరింత గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మేకపాటి చంద్రశేఖర్ ఇదే విషయం పైన సీఎంతో మాట్లాడాలని నిర్ణయించారు. జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన మేకపాటి.. తన టికెట్ గురించి ఆలోచన చేయాలని కోరినట్లు సమాచారం.
కానీ, సీఎం నుంచి అందుకు సానుకూలంగా స్పందించలేదనేది మేకపాటి వర్గీయులు చెబుతున్న మాట. అప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ద్వారా తెలుగుదేశం ముఖ్యులు చంద్రశేఖర రెడ్డిత టచ్ లోకి వెళ్లారని ప్రచారం. తనకు టికెట్ రాదనే నిర్ణయానికి వచ్చిన మేకపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసారని సమాచారం. దీంతో..ఆ ఇద్దరితో పాటుగా ఈ ఇద్దరి పైన వైసీపీ ఓటు వేసింది.
కానీ, మేకపాటి మాత్రం తాను వైసీపీ చెప్పిన అభ్యర్ధికే ఓటు వేసానని..ప్రమాణం చేస్తానని చెబుతున్నారు. తాను జగన్ కు వెన్నుపోటు పొడవలేదని.. జగన్ తనకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో వైసీపీ తదుపరి అడుగులు..టీడీపీకి ఓటు వేసారని చెబుతుండటంతో ఆ పార్టీ నుంచి ఏ రకంగా మద్దతు ఉంటుందనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications