నోటీసులిస్తాం: 'ఆంధ్రజ్యోతి' కథనం మండలిలో రభస
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దిన పత్రిక పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ముగ్గురు ఎమ్మెల్సీలు శనివారం పేర్కొన్నారు. ఇటీవల తెరాసలో చేరిన ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి శనివారం నాటి సమావేశంలో ఆంధ్రజ్యోతిపై హక్కుల ఉల్లంఘన నోటీసు అంశాన్ని ప్రస్తావించారు.
భానుప్రసాద్ మాట్లాడుతూ... ఆంధ్యజ్యోతి దినపత్రికలో.. బడ్జెట్‌లో అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పెంచుకున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు పెంచుకున్నారని రాశారన్నారు. అయితే, బడ్జెట్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని, కనీసం దానికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టలేదని భానుప్రసాద్ తెలిపారు.
ఆంధ్రజ్యోతి పత్రిక బాధ్యతారహితంగా, సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా వార్తలు రాసిందని, అలాంటి వార్తలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులపై రకరకాల ఆరోపణలు చేశారని, సభ్యులు గౌరవాన్ని కాపాడాలని, ఆ పత్రిక పట్ల సభ కఠినంగా వ్యవహరించాలని, సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

అందుకు తాము పది మంది సభ్యులం నోటీసును అందిస్తామన్నారు. సభా హక్కుల నోటీసును అందజేసేందుకు అనుమతించాలని ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సైతం స్పీకర్‌ను కోరారు. ఈ అంశంపై టీడీపీ శాసనమండలి సభాపక్ష నేత అరికెల నర్సారెడ్డి స్పందించారు.
ఆ ముగ్గురు సభ్యుల ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగానే సభ్యులకు ఇబ్బంది కలిగించేలా వార్తలున్నా, ప్రతిదానికీ ఇలా చర్యలు తీసుకుంటూ పోవడం సరికాదని, ఇతర పత్రికల్లోనూ అనేక వార్తలు వస్తున్నాయని, గతంలో టీవీ-9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానళ్లపై చర్యలు తీసుకోవాలని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి, ఏకంగా ఆ చానళ్ల ప్రసారాలనే నిలిపివేశారన్నారు.
ఇప్పుడేమో పత్రికలో వార్త వచ్చిందని, నోటీసు అంటున్నారని, ఇలా ప్రతి వార్తనూ పరిగణనలోకి తీసుకుని సభాహక్కుల పేరిట పత్రికలపై చర్యలు అంటే ప్రజలు క్షమించరన్నారు. కాగా, నర్సిరెడ్డి ప్రసంగం కొనసాగిస్తుండగానే ఆయన మైక్ కట్ చేశారు.
దీనిపై చైర్మన్ స్వామిగౌడ్ స్పందిస్తూ.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు రాతపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామని, ఇతర పత్రికల్లోనూ ఏం వచ్చిందో పరిశీలించాల్సి ఉందన్నారు. మండలి సమావేశం ముగిసిన తర్వాత మండలిలో నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడారు. మీడియా ఎప్పుడూ అధికారపక్షానికి అనుకూలంగా ఉండదని, అందులో వచ్చే వార్తలను స్వాగతించాలన్నారు. కాగా, మండలి ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా పడింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications