బీహార్ త‌ర‌హాలో వైసిపీ కుల రాజ‌కీయం : రైల్వే జోన్ ఓ కుట్ర : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

Recommended Video

    YCP కుల రాజ‌కీయం చేస్తోంది రైల్వే జోన్ ఓ కుట్రన్న చ‌ంద్ర‌బాబు!!

    కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వ్యాఖ్యలు చేశా రు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌ మసిపూసిన మారేడుకాయ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, రెండు పార్టీల లాలూచీకి ఇది రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

    జోన్ ప్ర‌క‌ట‌న‌లో కుట్ర‌..
    కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌ మసిపూసిన మారేడుకాయ అని అంటున్నారు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.
    ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని చంద్రబాబు విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, రెండు పార్టీల లాలూచీకి ఇది రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.విభజన హామీ లు అమలుచేయాలంటూ రేపు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇన్నేళ్లు రాజధాని తరలించాలని వైసీపీ మనసులో కుట్ర పెట్టు కుందని, ఇప్పుడు అభివృద్ధి చూసి ఏమీచేయలేక రాజధానిని తరలించబోమని చెబుతోందని చంద్రబాబు అన్నారు.

    Modi has no right to visit AP : Vizag railway Zone announcement is conspiracy : Babu

    వైసిపివి కుల రాజ‌కీయాలు..
    అలాగే వైసీపీ కులరాజకీయాలను తిప్పికొట్టాలని, బిహార్‌ తరహా కులద్వేషాలు రగిలించేలా కుట్రలు జరుగుతున్నా యని విమ‌ర్శించారు. ఏపీలో అడుగుపెట్టే హక్కు మోదీకి లేదన్నారు. హామీలన్నీ నెరవేర్చాకే మన గడ్డపై అడుగుపె ట్టాలన్నారు. నిన్న అమరావతిలో జగన్ గృహ ప్రవేశం... మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం.. జగన్‌కు నిలకడ లేదు.., విశ్వసనీయత లేదన్నారు. వైసీపీ, బీజేపీవి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలని, ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని, బీజేపీ, వైసీపీ నాటకాలను ప్రజలే ఎండగట్టాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+