వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీపై ప్రధాని మోదీ- అమిత్ షా మాస్టర్ ప్లాన్: వర్కవుట్ అయితే ఇక..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో బీజేపీ కొత్త ప్లాన్ సిద్దం చేస్తోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా..ప్రస్తుతం 25 లోక్ సభ సభ్యుల మద్దతు బీజేపీకే ఉంది. రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అదే స్పష్టం అయింది. కానీ, వచ్చే ఎన్నికల కోసం ఏపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ - పవన్ కళ్యాణ్ పొత్తుతో రెండు లోక్ సభ ..నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.

2019 ఎన్నికల్లో పొత్తు లేకుండానే పోటీ చేసి ఒక్క సీటు గెలవలేదు. కానీ, వైసీపీ ఎన్డీఏలో చేరకపోయినా, కేంద్రంలో అవసరమైన ప్రతీ సందర్బంలోనూ మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి 2014 ఎన్నికల పొత్తులు రిపీట్ అవుతాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తు ఛాన్స్ లేదని స్పష్టం చేస్తోంది.

ఏపీలో బీజేపీ కొత్త రాజకీయం

ఏపీలో బీజేపీ కొత్త రాజకీయం

జనసేన - బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతున్నా..రానున్న రోజుల్లో ఎటు టర్న్ తీసుకుంటుందో అర్దం కాని విధంగా ఉంది. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 144 లోక్ సభ స్థానాల పైన బీజేపీ స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది. 40 స్థానాల్లో నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. బహిరంగ సభలు.. స్థానికంగా ఆత్మీయ సమావేశాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో ఏపీలో నాలుగు లోక్ సభ నియోజక వర్గాల పైన బీజేపీ గురి పెట్టింది.

ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తూ..సమన్వయం చేసుకుంటే తమకు గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు గా గుర్తించింది. బీజేపీ- వైసీపీ మధ్య మైత్రి కొనసాగుతున్నా..అది అంశాల వారీగానే ఉంటుందని, తాము ఏ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పొత్తుల విషయంలో చంద్రబాబు మాత్రమే స్పందిస్తారని పార్టీ నేతలకు స్పష్టం చేసింది. అటు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

బీజేపీ ఒంటరి పోటీతో జగన్ కు లాభమేనా

బీజేపీ ఒంటరి పోటీతో జగన్ కు లాభమేనా

ఇటు బీజేపీ తమను కాదని, టీడీపీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోదని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. కానీ, అమరావతి విషయంలో బీజేపీ సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కమలం పార్టీ స్టాండ్ తీసుకుంది. బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో పదే పదే జగన్ ప్రభుత్వం పైన వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పైనా విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలోనే బీజేపీ ఏపీలోని విశాఖ..విజయవాడ..తిరుపతి..నర్సాపురం లోక్ సభ స్థానాల్లో కష్టపడితే గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతలకు పార్టీ దిశా నిర్దేశం చేసింది. అందులో భాగంగా..సర్వేలు జరుగుతున్నాయి. సీఎం జగన్ విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని నిర్ణయించారు. రాజకీయంగానూ టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహాలను ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రలో ప్రారంభించింది. ఇక, రాజమండ్రి..నర్సాపురం..కాకినాడల్లోనూ ఈ సర్వే నిర్వహించారు. అందులో నర్సాపురంలో మిగిలిన రెండు నియోజకవర్గాల కంటే సానుకూలత కనిపించిందని సమాచారం.

పొత్తులపై డైలమా - మారుతున్న అంచనాలు

పొత్తులపై డైలమా - మారుతున్న అంచనాలు

దేశ వ్యాప్తంగా 144 నియోజకవర్గాల్లో ఏ విధంగా మోదీ - షా ద్వయం ప్రణాళికలు అమలు చేయనున్నారో..అదే విధంగా ఈ నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని డిసైడ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా.. కేంద్ర మంత్రులు తరచూ ఈ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయనున్నారు. స్థానికంగా జరిగే ఉత్సవాలకు హాజరు కానున్నారు.

స్థానిక నేతలు, ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి.నియోజకవర్గంలోని ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు, వ్యాపారులు, ఇతర వృత్తి నిపుణులతో తరచుగా వర్చువల్ సమావేశాలు నిరంతరం కొనసాగించాలని నిర్దేశించారు. అయితే, బీజేపీ వ్యూహం సక్సెస్ అయితే..అది రాజకీయంగా తమకు ఎటువంటి నష్టం చేస్తుందనే అంచనాల్లో ఇప్పుడు వైసీపీ - టీడీపీ ముఖ్య నేతలు లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతగా చీలితే అంత మేలు జరుగుతోందని వైసీపీ అంచనా వేస్తోంది. టీడీపీ పొత్తుల వ్యవహారం తేలే వరకూ వేచి చూసే ధోరణితో ఉంది. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Pm Modi and Home Minister Amit Shah implementing new strategy in AP, mainly Foucs on Four loksabha seats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X