మోడీ తీస్రీబార్, ఆయన వల్లే సాధ్యం: మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుపతి: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు.

'ఇవాళ నేను ఏం మాట్లాడినా అది అతిశయోక్తి అనుకుంటారు. కానీ, నేను చెప్పేది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఈ మాత్రం ధైర్యంగా మనం భారతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోలుగుతున్నాం అంటే అందుకు కారణం ప్రధాని మోడీ ఒక్కరే. ఆయన లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి' మోహన్ బాబు పేర్కొన్నారు.

Modi will be PM for third time: Mohan Babu

మనం ఉన్న పరిస్థితుల్లో కులాలు ఏవీ లేవు. అందరూ ఒకటేనని ముందుకెళుతుంటే... తెలిసో తెలియకో కొందరు అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ, మన ప్రధాని మనమందరం ఒక్కటే అని చాటేలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అక్కడ అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మోడీ చేస్తున్నవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు జీవించాలని, ఎల్లప్పుడూ ఆయన మనకు ప్రధానిగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ ప్రధాని కాకముందే ఆయనను మేం కుటుంబ సమేతంగా పార్క్ హయట్ హోటల్ లో కలిశాం. సార్.. మీరు(మోడీ) ప్రధాని కావాలని కోరుకుంటున్నాం అని చెప్పాం. అందుకాయన స్పందిస్తూ.. ఎందుకు? అన్నారు. దాంతో కొన్ని అంశాలను ఆయనకు వివరించాం. దాంతో ఆయన సంతృప్తి చెంది.. నువ్వు నిజమైన కళాకారుడివి అని అభినందించారు. దేవుడి దయ ఎలా ఉందో... చూద్దాం అని అన్నారు. ఆ విధంగా ఆయన రెండు పర్యాయాలు విజయాలు సాధించారు. ఆయన మూడోసారి కూడా గెలుస్తారు అని మోహన్ బాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ మోహన్ బాబు. ఇది ఇలావుండగా, 22న జరగనున్న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకు కూడా ఆహ్వానం అందిందని మోహన్ బాబు వెల్లడించారు. ఎవరి నుంచి ఆహ్వానం అందాలో వారి నుంచే ఆహ్వానం అందిందన్నారు.

అయితే, వెళ్లాలో, వద్దో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు మోహన్ బాబు. 'రామ మందిరం ప్రారంభోత్సవానికి చాలామంది వస్తున్నారు. అంతమంది మధ్యలో నేను తట్టుకోలగనో, లేదో? వెళ్లాలని మనసులో సంకల్పం ఉంది.. హనుమంతుడి ఆశీస్సులు, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది' అని మోహన్ బాబు చెప్పారు. కాగా, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్‌లకు అయోధ్య మందిర ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+