ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ కీలక ట్వీట్..
ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. 'రేపు.. అనగా అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటాన.. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా.. కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7.20 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరుతారు. ఉదయం 9 గంటల 50 నిమిషాలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10 గంటల 55 నిమిషాలకు శ్రీశైలం చేరుకుంటారు. 11 గంటల 15 నిమిషాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. అయితే ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు.
I will be in Andhra Pradesh tomorrow, 16th October. I will pray at the Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam in Srisailam. After that, I will be in Kurnool where development projects worth over Rs. 13,400 crores would be inaugurated or their foundation stones would…
— Narendra Modi (@narendramodi) October 15, 2025
" రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి" అని ప్రధాని మోదీ ట్వీట్ ఉంది.

మరోవైపు ప్రధాని మోదీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పర్యటనపై ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని వివరించారు.












Click it and Unblock the Notifications