తమ్ముడు పరిటాల లేని లోటు కనిపిస్తోంది: భావోద్వేగంతో మోహన్ బాబు కంటతడి
అనంతపురం: తమ్ముడు పరిటాల రవి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, పరిటాల రవి అడుగుజాడల్లో సునీత ధైర్యంగా నడుస్తోందని ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆయన వెంకటాపురంలో పరిటాల రవి ఘాట్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిటాల రవి కుటుంబాన్ని నమ్ముకున్న వారందరూ సంతోషంగా జీవిస్తూ, పరిటాల కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. రాయలసీమ ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునే నేత వైయస్ జగన్: బొండా

రాష్ట్రం అభివృద్ధి జరగాలని ప్రజలు, శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకునే ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్మోహన్‌రెడ్డేనని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
రాష్ట్రం బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారో వారంతా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు.
జగన్‌లా ఉత్తర కుమారుని పలుకులు మేము పలకమని, మేము ఏదైనా చెప్పామంటే అది చేసి తీరుతామని అన్నారు. కోట్లు, నోట్లు, ఓట్లు జగన్ నైజమని, కేవలం అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని బోండా ఉమా అన్నారు.












Click it and Unblock the Notifications