పోలీసులపై మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎంత మాట అనేశారు!!
మంచు మోహన్ బాబు.. విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల గురించి సంచలన కామెంట్స్ చేసిన మోహన్ బాబు ఐఏఎస్ లు, ఐపిఎస్ లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పని చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

పోలీసులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు
పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు తిరుపతిలో నిర్వహించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్ చేశారు. అంతేకాదు తాను నిజాన్ని నిర్భయంగా చెబుతానంటూ వివాదానికి తెరలేపారు. ఇక ఫంక్షన్ కు వచ్చిన అభిమానులు చాలామంది మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై షాక్ అయ్యారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వంపై, పోలీసులపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి కాంట్రవర్సీకి కారణమవుతాయో అన్న ఆందోళన అందరిలో కనిపిస్తుంది.

పోలీసుల గురించి గొప్పగా మొదలెట్టి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు
అయితే మోహన్ బాబు సినిమా ను ఉద్దేశించి చెప్పినా, రియల్ లైఫ్ లో పరిస్థితులను చెప్పినా ఆయన పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమైన వ్యాఖ్యలు అని చెప్పక తప్పదు. అసలు ఇంతకీ మోహన్ బాబు ఏమన్నారంటే తానెప్పుడూ పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తానని, వాళ్లు ఎంతో కష్టపడి మన నుండి ఆ ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లే అని, కచ్చితంగా వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. సమాజంలో ఎటువంటి నిజమైన ముందుగా పోలీసులకు, అందులో ముఖ్యంగా కానిస్టేబుళ్లకు ముందు తెలుస్తుందని పేర్కొన్న ఆయన అంత వరకు బాగానే ఉన్నా అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఏ ప్రభుత్వం ఉంటే వారికి తొత్తులుగా పోలీసులు .. మోహన్ బాబు వ్యాఖ్యలు
ఎక్కువ కాలం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయడం, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాల్సిన అవసరం కొంత మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ ల పై ఉంటుందని మోహన్ బాబు వెల్లడించారు. కిందిస్థాయి పోలీసులు తమ పై స్థాయి అధికారులు చెప్పింది కాకుండా, ఏదైనా వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే అతని ఉద్యోగమే పోతుంది అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంటే పై అధికారులు ఎక్కువ శాతం ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తాను ఓపెన్ గానే చెబుతానని మోహన్ బాబు వెల్లడించారు.

మోహన్ బాబు ఎలా చెప్పినా దీనిపై చర్చ , ఏం జరుగుతుందో?
తానెప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్ కి గౌరవం ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన అసలు ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. ఆయన జనరల్ ఒపీనియన్ గా దానిని చెప్పారా? లేక ఏదైనా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతాయా? లేదా పోలీసు అధికారులు దీనిని లైట్ తీసుకుంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
-
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications