కమిట్ మెంట్ కి విష్ణు వారసుడు - ఏ సమస్య వచ్చినా పక్కనే : గెలిపించండి..మోహన్ బాబు అభ్యర్ధన..!!

'మా' ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు గెలుపు కోసం ఆయన తండ్రి..సీనియర్ హీరో మోహన్ బాబు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ - మోహన్ బాబు ప్యానళ్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. హోరా హోరీగా రెండు ప్యానళ్ల సభ్యులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇక, సమయం దగ్గర పడుతుండటంతో ఓట్లు దక్కించుకోవటానికి వ్యూహాలను ముమ్మరం చేసారు. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

అభ్యర్ధుల చివరి ప్రయత్నాలు

అభ్యర్ధుల చివరి ప్రయత్నాలు

అయితే, ఇప్పుడు మెగా బ్రదర నాగబాబు ఓపెన్ గానే ఆ విషయం చెప్పారు. మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని..ఇంకా పలువురు హీరోలు ప్రకాం రాజ్ కు మద్దతుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు విడుదల చేసిన ప్రకటన ఆసక్తి కరంగా మారుతోంది. తాను 'మా' అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వృద్ధాప్య ఫించన్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేసారు. ఇండస్ట్రీలో ఎవరి ఏ కష్టం వచ్చినా తనున్నానని ముందు నిలబడ్డ దాసరి నారాణరావు గారి అడుగుజాడల్లో నడుస్తున్న వాడినని చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు అభ్యర్ధన

మోహన్ బాబు అభ్యర్ధన

1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకూ సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త సాంకేతిక నిపుణులను, కళాకారులను పరిచయం చేయటమే కాకుండా 24 క్రాప్ట్స్ లో ఉన్న వారి పిల్లలకు తను స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించానని చెప్పుకొచ్చారు. ఇక పై కూడా అది కొనసాగుతుందని స్పష్టం చేసారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని, విష్ణుతో పాటు పూర్తి ప్యానెల్ కి ఓటు వేసి సమర్ధవంతమైన నిర్వహణకు సహకరించాలని మోహన్ బాబు కోరారు.

ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తారంటూ

ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తారంటూ

ఓటును ఆలోచించి అందరి బాగు కోసం తాపత్రయపడుతున్న తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని మోహన బాబు అభ్యర్ధించారు. మోహన్ బాబు తన కుమారుడిని బరిలోకి దించే సమయంలోనే హీరో క్రిష్ణతో సంప్రదించారు. తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ పూర్తిగా విష్ణుకు అండగా నిలిచారు. ఇక, విష్ణు ప్యానల్ పైనా నరేశ్ మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ - జీవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. ఇక, మోహన్ బాబు ఓటర్లుగా ఉన్న వారితో అనేక మందితో ఫోన్ లో మాట్లాడినట్లుగా విష్ణు ఇప్పటికే వెల్లడించారు.

అన్ని వర్గాల్లోనూ ఫలితాలపై ఆసక్తి

అన్ని వర్గాల్లోనూ ఫలితాలపై ఆసక్తి

ఇక, చిరంజీవి తనకు ఫోన్ చేసారని..విష్ణు పోటీ గురించి అడగ్గా.. చిరంజీవి కుటుంబలో ఎవరైనా పోటిలో ఉంటే తాను విష్ణుతో విత్ డ్రా చేయిస్తానంటూ మోహన్ బాబు సమాధానం ఇచ్చారు. అయితే, తాను మాట ఇచ్చానని చెప్పగా... ఎవరో బయట వక్తికి మాట ఇచ్చానంటూ చిరంజీవి చెప్పిన అంశం తనకు బాధ కలిగించిందన్నారు. ఇక, పోలింగ్ కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. దీంతో..రెండు శిబిరాలు తమ చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అదే విధంగా రాజకీయంగా కంటే ఈ ఎన్నికల పైన సినీ ఇండస్ట్రీతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్..అదే విధంగా సాధారణ ప్రజలు సైతం ఆసక్తి కరంగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+