డబ్బున్న వారికేనా, చిట్టా అంతా నా వద్ద ఉంది కానీ: మోహన్ బాబు సంచలనం
మోహన్ బాబు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వారికే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వారికే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు కావాల్సిన వారినే ధ్వజస్తంభం దర్శనానికి అనుమతిస్తున్నారని ఆరోపించారు.

ఒక్కో అధికారి ఒక్కో నిబంధన అమలు చేస్తున్నారని మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. టిటిడి అధికారుల చిట్టా అంతా నా వద్ద ఉందని, కానీ దేవుడికి వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. వారిని ఆ దేవుడే శిక్షిస్తాడన్నారు.












Click it and Unblock the Notifications