అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈడీ షాక్, మారిన జగన్ ముఖం: 750కోట్లు కాదు.. వేలకోట్లే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.749 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ బుధవారం నాడు అటాచ్ చేసింది. ఆయన ఇఫ్తార్ విందులో ఉండగా ఈడీ షాకిచ్చింది. ఈ విషయం తెలియగానే జగన్ ముఖకవళికలు మారిపోయాయి.

అయితే, తాను ప్రస్తుతం ఇప్తార్ విందులో ఉన్నానని, వాటి గురించి మాట్లాడానని ఆయన చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ ఆస్తుల జఫ్తు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. కాగా, జగన్‌కు చెందిన రూ.749 కోట్లను జఫ్తు చేసినప్పటికీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఎక్కువేనంటున్నారు.

జగన్ 30 స్థిర, చరాస్తులను కలిపి అంచనా కట్టి, రూ.749 కోట్లుగా లెక్కించి, జఫ్తు చేసుకున్నారు. బెంగళూరులోని విలాసవంత ప్రాంతమైన యలహంకలోని జగన్ ప్యాలెస్‌ను, కోరమంగళలోని మంత్రి వాణిజ్య సముదాయాన్ని కూడా ఈడీ అటాచ్ చేసింది.

జగన్‌కు మరో షాక్: లోటస్ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల అటాచ్జగన్‌కు మరో షాక్: లోటస్ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల అటాచ్

ఈ రెండు ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.500 కోట్లకు పైగా ఉంటుంది. యలహంకలోని జగన్ నివాసం ప్యాలస్‌లా ఉంటుంది. గతంలో వైయస్ సీఎంగా ఉన్నప్పుడు హెచ్ఏఎల్ విఐపీ విమానాశ్రయం నేరుగా యలహంక ప్యాలెస్‌లో దించేవారు.

హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో ఉన్న జగన్ మీడియా భవనం విలువను ఈడీ 43.70 కోట్లుగా అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఉంటున్నారు. లోటస్ పాండు బిల్డింగ్ విలువ రూ.56.89 కోట్లుగా ఈడీ పేర్కొంది.

స్థలం, భవనం కలిపి రూ.300 కోట్లు బహిరంగ మార్కెట్లో ఉంటుందని చెబుతున్నరు. గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్‌కు చెందిన 903 ఎరకరాల విలువ రూ.31 కోట్లుగా పేర్కొన్నారు. దీని ప్రస్తుత విలువ రూ.అరకోటి ఉండవచ్చునని అంటున్నారు.

భారతీ సిమెంట్స్ 51 శాతం వాటాని ఫ్రాన్సుకు చెందిన వైకాట్ కంపెనీ రూ.2500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇందులో జగన్‌కు ఉన్న 9 శాతం ఈక్విటీ షేర్లను ఈడీ జఫ్తు చేసింది.

వాటి విలువను రూ.23.80 కోట్లుగా ఈడీ పేర్కొంది. ఫ్రాన్స్ కంపెనీ విలువ ప్రకారం చూస్తే రెండున్నరవేల కోట్లు ఉంటుందంటున్నారు. మొత్తంగా ఈడీ జఫ్తు చేసిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.4వేల కోట్ల వరకు ఉండవచ్చునని అంటున్నారు.

జగన్

జగన్

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా భారతి సిమెంట్స్‌ కేసులో రూ.749.10 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ బుధవారం ఉత్తర్వులను జారీచేసింది.

జగన్

జగన్

యుటోపియా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, హరీష్‌ ఇన్‌ఫ్రా కంపెనీల పేరుతో నిర్మించి, జగన్‌ నివాసం, పార్టీ కార్యాలయంగా ఉన్న లోటస్‌పాండ్‌లోని భవనం, బెంగళూరులో వాణిజ్య భవన సముదాయం (కామర్స్‌ అట్‌ మంత్రి), అక్కడి జగన్‌ బంగళా, సరస్వతి పవర్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్న 903 ఎకరాలు, సాక్షి టవర్స్‌, వైఎస్‌ భారతి, జగన్‌లకు వివిధ కంపెనీల్లో ఉన్న వాటాలు, పలు సంస్థల స్థిరాస్తులతోపాటు... ఆ కంపెనీలకు ఇతర సంస్థల్లో ఉన్న వాటాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

జగన్

జగన్

జగన్‌కు చెందిన రఘురాం/భారతి సిమెంట్స్‌కు కడప జిల్లాలో 2,037 ఎకరాల లీజును కట్టబెట్టడంలోనూ, దానికి ఓబీసీ రుణం మంజూరు చేయడంలోనూ, ఆపై ఆ కంపెనీల్లోకి పెట్టుబడులుగా వచ్చిన ముడుపుల ప్రవాహంపైనా సీబీఐ తన 7వ అభియోగపత్రం (25/13)లో ఆరోపణలు చేసింది.

జగన్

జగన్

ఇందులో భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 120బి, 420, 107 రెడ్‌విత్‌ 13 (2)రెడ్‌విత్‌ 13(1)(డి)-అవినీతి నిరోధక చట్టం కింద పేర్కొన్న అభియోగాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని తిప్పలూరు, టి.సుంకేశుల గ్రామాలపరిధిలో సిమెంట్‌ పరిశ్రమకు నాణ్యమైన సున్నపురాయి నిల్వలు ఉన్నాయి.

జగన్

జగన్

వాటిని గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్స్‌ ప్రాస్పెక్టింగ్‌ లీజు పొంది కార్యకలాపాలు కొనసాగిస్తుండగా... దాని లీజును రద్దుచేసి రఘురాం/భారతి సిమెంట్స్‌కు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. మరోవైపు ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా ఇండియా, దాల్మియా సిమెంట్‌ కంపెనీలతోపాటు పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

English summary
The Enforcement Directorate Wednesday attached moveable and immovable assets valued at over Rs 749 crore belonging to YSR Congress Party chief Y S Jagan Mohan Reddy under the Prevention of Money Laundering Act (PMLA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X