వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా టూడే సర్వే : ఏపీ - తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు : మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్టాల్లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. 2024లో పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అందులో భాగంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టూడే దేశ వ్యాప్తంగా పబ్లిక్ పల్స్ తెలుసుకొనే ప్రయత్నం చేసింది. తాజాగా నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది.

కేంద్రంలో మరోసారి మోదీ హవా

కేంద్రంలో మరోసారి మోదీ హవా

ఇండియా టూ డే - సీ ఓటర్ తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో జాతీయ స్థాయిలో మరోసారి ప్రజలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారు. అయితే, సీట్లు మాత్రం గతం కంటే తగ్గుతాయని సర్వే తేల్చింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలివగా.. ఈ సారి 286 వస్తాయని అంచనాకు వచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ సొంతంగా గతం కంటే సీట్ల సంఖ్య పెంచుకుంటున్నట్లుగా సర్వే లో స్పష్టం అయింది. 2019లో కాంగ్రెస్ సొంతంగా 52 సీట్లు దక్కించుకోగా.. 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 146 కు చేరే అవకాశం ఉందని సర్వే లో తేల్చారు. ఇతరులు 111 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా ప్రధానిగా మోదీనే కొనసాగాలంటూ సర్వేలో 54 శాతం మద్దతు లభించింది. ప్రధానిగా రాహుల్ గాంధీకి మద్దతుగా 9 శాతం మందే నిలిచారు.

ఏపీలో జగన్ వైపే మెజార్టీ ప్రజలు

ఏపీలో జగన్ వైపే మెజార్టీ ప్రజలు

ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరం అవుతున్న వేళ కూడా.. ప్రజలు మోదీ నాయకత్వానికే మద్దతుగా నిలుస్తున్నట్లు సర్వే లో తేలింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వైసీపీ పైన వ్యతిరేకత ఉందని ప్రచారం సాగుతున్న వేళ..ఇండియా టూడే సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడుతున్నట్లు స్పష్టం అయింది. వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు వస్తాయని..టీడీపీకి ఏడు స్థానాలు దక్కుతాయని సర్వేలో తేలింది. దీని ద్వారా ప్రస్తుతం వైసీపీకి ఉన్న 22 స్థానాల్లో నాలుగు వరకు తగ్గే అవకాశం ఉంది. టీడీపీకి మూడు స్థానాలు ఉండగా.. వైసీపీ నుంచి నాలుగు స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటున్నట్లుగా సర్వే లెక్కలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వెల్లడైన ఇండియా టీవీ సర్వేలోనూ ఏపీలో వైసీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది.

తెలంగాణలో పుంజుకున్న బీజేపీ

తెలంగాణలో పుంజుకున్న బీజేపీ

ఇప్పుడు 18 లోక్ సభ స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పటం ద్వారా.. 127 అసెంబ్లీ స్థానాల్లో వైసీపికి సానుకూలత ఉందని సర్వే అంచనాకు వచ్చింది. ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ -బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ సభ స్థానాల్లో బీజేపీ గణనీయంగా పంజుకుంది. ఇండియా టూడే సర్వే ప్రకారం బీజేపీ ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్ల సంఖ్యను 6 కు పెంచుకొనే అవకాశం ఉంది. ఇక, టీఆర్ఎస్ 8 స్థానాలు.. కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకే మెజార్టీ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని పైన పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.

English summary
As er India today mood of the nation report Prime Minister Narendra Modi’s popularity continues . In both telugu states Ruling parties get majority seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X