దిశా యాప్ భేష్..జగన్‌లాంటి సీఎంను దేశంలో చూడలేదు: పర్వతారోహకురాలు ఆశా మాలవ్య
సీఎం జగన్ మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు భేష్ అని అన్నారు ప్రముఖ పర్వతారోహకురాలు ఆశ మాలవ్య
విజయవాడ: ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు ఆశా మాలవ్య. ఈమె పర్వతారోహకురాలు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తోంది. సైకిల్ యాత్రలో భాగంగా ఆశా మాలవ్య తిరుపతిలోకి అడుగుపెట్టడం ద్వారా ఆంధ్రపద్రేశ్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంది. అయితే ఏపీలో ఎంటర్ అయినప్పటి నుంచి తనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించిందని చెప్పుకొచ్చింది ఆశ మాలవ్య.
ఇక తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసింది. ఆశా మాలవ్య కృషిని ఈ సందర్భంగా సీఎం జగన్ కొనియాడారు.మౌంటెనీయరింగ్‌లో తాను రికార్డు హోల్డర్‌నంటూ మాలవ్య వివరించింది. ప్రస్తుతం తాను 25 వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత్ యాత్ర చేస్తున్నట్లు చెప్పిన మాలవ్య...గతేడాది నవంబర్ 1వ తేదీన భోపాల్‌లో తన సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు వెల్లడించింది.మొత్తం 28 రాష్ట్రాల్లో తన యాత్ర నిర్వహించాలనే లక్ష్యంతో కదిలిని మాలవ్య, ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసుకుంది.భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉందని, మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని తాను ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఈ యాత్ర ప్రారంభించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే తాను సీఎం జగన్‌ను కలిసినట్లు చెప్పిన మాలవ్య.. ఆయన్ను కలవడం ఎంతో ఉద్వేగంగాను, గర్వంగాను ఉన్నట్లు వెల్లడించింది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై సీఎం విజన్ ఎంతో గొప్పగా ఉందని వివరించింది.మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని చెప్పింది.ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టారని వెల్లడించిన మాలవ్య తాను కూడా దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని స్వయంగా పరీక్షించినట్లు తెలిపింది.దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోందని స్పష్టం చేసింది.
భారత్‌ను సైకిల్ పై చుట్టేస్తోన్న ఆషా మాలవియా.. సీఎం జగన్‌ను కలిసిన సైకిలిస్ట్..!!#AshaMalviya #YSjagan #CMJagan #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/l529Y2cKme
— oneindiatelugu (@oneindiatelugu) February 6, 2023
ఏపీలో మహిళలు మాత్రమేకాదు అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. తన ఆశయం కోసం సీఎం జగన్ 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివని కొనియాడిన మాలవ్య.. జగన్‌మోహన్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని చెప్పారు.












Click it and Unblock the Notifications