YS Viveka Case: అవినాష్ ఆరోపణలపై సీబీఐ కీలక అడుగు - నేడు తేలిపోతుందా..!?

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు అవినాష్ లక్ష్యంగా కేసు నడుస్తున్నట్లు కనిపించింది. ఇప్పుడు సీబీఐ అవినాష్ ఆరోపణల ఆధారంగా విచారణ లో ముందుకు సాగుతోంది. వైఎస్ సునీత..రాజశేఖర రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో సుప్రీం ఆదేశాల తరువాత హై కోర్టులో గురువారం అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది.

నేడే కోర్టులో విచారణ:అవినాష్ రెడ్డి కోర్టులో తన వాదనల్లో భాగంగా వివేకా హత్య కేసు వెనుక పలు కారణాలను ప్రస్తావించారు. ఆర్దిక వ్యవహారాలు, వివేకా రెండో భార్య అంశాన్ని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో అవినాష్ చేసిన ఆరోపణలతో సీబీఐ తాజాగా సునీతను విచారించింది. ఆమె భర్త రాజశేఖరరెడ్డిని రెండు సార్లు విచారించి..సమాచారం సేకరించింది. తాజాగా పులివెందులలో దస్తగిరి భద్రత గురించి ఆరా తీసింది. ఇప్పుడు వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేస్తోంది. వివేకా హత్యకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఇనాయ్‌ తుల్లా.. ప్రకాష్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ స్నేహితులు రాజు, చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకట్‌ రాజేషల‌ను కూడా సీబీఐ విచారించింది.

MP Avinash Reddys anticipatory bail petition

అటు సీబీఐ దూకుడు:అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే ఇదే పిటీషన్ పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టులో ఇచ్చిన ఆదేశాల పైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో విచారణ తరువాత హైకోర్టు ఆదేశాలను సుప్రీం తప్పుబట్టింది. అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనే అభ్యర్ధనను సుప్రీం తోసి పుచ్చింది. ముందస్తు బెయిల్ పిటీషన్ లో గురువారం హైకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారుతోంది. ఈ సమయంలో కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అవినాష్ విషయంలో సీబీఐ ముందడుగు వేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు సునీత కూడా తమ వాదనలు వినాలని కోర్టులో కోరారు. శుక్రవారం సునీత వానదలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

నేడు కీలక పరిణామాలు:అవినాష్ విచారణలో ఏం జరిగిందనే అంశాలతో పాటుగా తాజా పరిణామాలను ఈ రోజు హైకోర్టుకు సీబీఐ నివేదించే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణలో భాగంగా తమ వాదనలు కూడా వినాలని సీబీఐ కోరింది. ఈ రోజు రేపు అవినాష్, సీబీఐ, సునీత వాదనలు వినేందుకు కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ఈ వాదనల తరువాత అవినాష్ పిటీషన్ పైన కోర్టు నిర్ణయం వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. అటు కడప, ఇటు హైదరాబాద్ లో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సుప్రీం కోర్టు జూన్ చివరి వరకు విచారణ గడువు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో, ఇటు సీబీఐ విచారణ వేళ వివేకా కేసులో గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+