ఎంపీ కేశినేనికి వైసీపీ ఆహ్వానం - దేవినేని ఉమా అనుకూల శత్రువు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. కేశినేని వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించటం...వచ్చే ఎన్నికల్లో పోటీ పైన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కేశినేనికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో విజయవాడ తో సహా లోక్ సభ పరిధిలోని సీట్లలో వైసీపీ కొత్త రాజకీయం ప్రారంభించింది.
కేశినేని నాని వ్యాఖ్యలతో:విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సస్ లోకల్ టీడీపీ నేతలు అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. తనకు వ్యతిరేకంగా తన సోదరుడికి టీడీపీ నేతలు మద్దతు ఇవ్వటాన్ని నాని సీరియస్ గా తీసుకుంటన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పై పరోక్షంగా ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నందిగామ ఎమ్మెల్యేల ను నాని ప్రశంసించటం అక్కడి టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్న సమయంలో సొంత పార్టీ ఎంపీ ప్రత్యర్ధి పార్టీ నేతలను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుంటే కేశినేని భవన్ లో కూర్చొని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని నాని వ్యాఖ్యానించారు.

నాని వస్తే ఆహ్వానిస్తాం:ఇప్పుడు ఈ వ్యాఖ్యలను వైసీపీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత..రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. 30 మంది అధికారపక్ష ఎమ్మెలయేలు టచ్ లో ఉన్నారని టీడీపీ ప్రచారం పైనా స్పందించారు. దీనిని టీడీపీ మైండ్ గేమ్ గా కొట్టి పారేసారు. ఇదే సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ అనకూల శత్రువుగని వ్యాఖ్యానించారు. నందిగామలో ఉమా ప్రచారం చేస్తే రెండో సారి కూడా జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలుస్తారని కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఉమా కారణంగానే ఆ ఇద్దరూ:ఉమా గతంలో గ్రానైట్, ఇసుక అక్రమంగా దోచుకొని ఎదిగారని ఆరోపించారు. ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్ కు అంత బలుపా అంటున్నారని..నాలుగు సార్లు గెలిచిన ఉమా పై 13 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తనకు బలుపేనన్నారు. దేవినేని ఉమా వ్యవహార శైలితోనే టీడీపీ నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులు వైసీపీలో చేరారని కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉమా ఎక్కడకి వెళ్లినా టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేసారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తానని కేశినేని వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. కేశినేని నాని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో నాని భవిష్యత్ అడుగుల పైన ఆసక్తి కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications