'గుంటూరు-నవ్యాంధ్ర రాజధాని మధ్య మెట్రో రైలు'
గుంటూరు: గుంటూరు- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై జరిగిన ప్రసంగంలో మాట్లాడారు.
గుంటురూ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ నవ్యాంధ్ర రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. తుళ్లూరులో నిర్మితమవుతున్న నవ్యాంధ్ర రాజధాని నుంచి గుంటూరు దాకా మెట్రో రైలుని ఏర్పాటు చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా గెలుపొందారు.













Click it and Unblock the Notifications