4గురు చిన్నారుల స్థితి విషమం: ఎంపీ కవిత పరామర్శ

ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని కవిత హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నివేదిక తయారు చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆమెతో పాటు పెద్దపల్లి తెరాస పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కూడా చిన్నారులను పరామర్శించారు.
ఇలాంటి ఘటనలు రైల్వే హత్యలని సిపిఎం నేత నారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా 14 వేల రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులు లేరని ఆయన అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడినవారికి రూ.10 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
నలుగురి పరిస్థితి విషమం
మెదక్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన వైద్యులు వరుణ్, ప్రశాంత్, వైష్ణవి, తరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్, శ్రావణి, శిరీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
అభినంద్, శివకుమార్, సందీప్, నితూష వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వారు వెల్లడించారు. మిగిలిన తొమ్మిది మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వారిని సాయంత్రం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తర లించనున్నట్లు వారు తెలియజేశారు. సాయిరాం, రుచిత, సాత్విక, హరీష్, మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్, దర్శన్, కరుణాకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వివరించారు.












Click it and Unblock the Notifications