కాల్ మని చేసేవాళ్ళకు సీట్లా - టీడీపీలో ప్రక్షాళన జరగాలి : ఎంపీ కేశినేని సంచలనం..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ నేతలే లక్ష్యంగా విమర్శలు చేసారు. టీడీపీలో ప్రక్షాళన అవసరమని చెప్పుకొచ్చారు. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని నాని తేల్చి చెప్పారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవచ్చు, దావుద్ ఇబ్రహీం లాంటి వారిని, లాండ్ గ్రాఫర్ లకి, ఉమెన్జర్ కి ఇవ్వొచ్చు అంటూ సంక్రాంతి వేళ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెంచారు. తాను ఎంపీని అయితేనే ఈ స్థాయికి రాలేదన్నారు. తనకు ఒక బ్రాండ్ ఉందని చెప్పుకొచ్చారు.
తాను రాజకీయాల్లోనే కాదు..జీవితంలోనూ ఎవరినీ మోసం చేయలేని నాని చెప్పారు. తనకు ఒక క్లారిటీ ఉండటంతో తాను అవినీతి కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందన్నారు. చార్లెస్ సోబ్రాజ్, దావుద్ ఇబ్రహీం సెక్స్ రాకెట్, కాల్ మని చేసేవాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉందంటూ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేసారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవచ్చు, దావుద్ ఇబ్రహీం లాంటి వారిని, లాండ్ గ్రాఫర్ లకి, ఉమెన్జర్ కి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయం తో టీడీపీ స్థాపించారని.. ఆ ఆశయంతో పనిచేయాలని ఉంటే సూచించారు. కాదని ఇలాంటి వారికి సీటు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించాలంటే సీట్లు ఇవ్వొచ్చంటూ చురకలు అంటించారు.

తాను ఢీల్లి స్థాయి నాయకుడిని చెప్పిన కేశినేని..తన సేవలు పార్టీ కావాలంటే వాడుకోవచ్చని స్పష్టం చేసారు. తనకు ఒక బ్రాండ్ ఉందని చెప్పిన కేశినేని..ఎంపీ కాకపోతే టాటా ట్రస్ట్ లాంటి వాటిని తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేసారు. కేశినేని చిన్నికి సీటు ఇస్తే మంచిదే కదా అంటూ వ్యాఖ్యానించిన ఎంపీ.. తన మద్దతు ఉండదని స్పష్టం చేసారు. క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సిటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ, చీటర్స్.. లాండ్ మాఫీయా డాన్ లకి,రియల్ ఎస్టేట్, మోసాలు చేసే వారికి, పేకాట క్లబ్ లు నడిపే వాళ్ళ కి మద్దతు ఇవ్వనంటూ ఫైర్ అయ్యారు. సొంత పార్టీలోని కొందరు నేతలను ఉద్దేశించి కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications