రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాలీవుడ్ కు వైసీపీ ఎంపీ అల్టిమేటం - జగన్ ప్రభుత్వం కోరుతోంది అదేనా : ఇరకాటంలో ఫిల్మ్ ఇండస్ట్రీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం కొనసాగుతున్న సమయంలో అధికార పార్టీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటం పైన టాలీవుడ్ కు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా.. తాజాగా యువ హీరో నాని టిక్కెట్ల రేట్లు తగ్గించటమంటే ప్రేక్షకులను అవమానించటమేనంటూ వ్యాఖ్యానించారదు. మరో యువ హీరో నిఖిల్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

రోజు రోజుకీ పెరుగుతున్న వివాదం

రోజు రోజుకీ పెరుగుతున్న వివాదం

ఇక, చిరంజీవి లాంటి వారు ట్వీట్ల ద్వారా టిక్కెట్ల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో టిక్కెట్ల ధరలను పెంచారు. దీంతో..త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాల పైన ప్రభావం పడుతుందనే ఆందోళన టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఇక, కొద్ది రోజులుగా ఏపీలో అన్ని ప్రాంతాల్లోనూ సినిమా థియేటర్ల పైన సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు అనేక థియేటర్లను మూసేసారు. పలువురు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇక, చాలా మంది సినిమా థియేటర్ల యజమానులు స్వచ్చందంగా థియేటర్లను మూసేసారు.

ఎంపీ మార్గాని భరత్ కొత్త డిమాండ్


ఇక, దీని పైన రాజకీయంగానూ టీడీపీ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు వైసీపీ రాజమండ్రి ఎంపీ..లోక్ సభలో వైసీపీ విప్ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత వివాదం నడుస్తున్న సమయంలో ట్వీట్ చేసారు. అందులో...తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోఉంది. ఏపీలో లేదు. కానీ 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది.లైట్‌ బాయ్‌ నుంచి స్టార్‌ హిరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌ పెద్దలు, ఏపీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలని ట్వీట్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వం అదే డిమాండ్ చేస్తోందా

ఏపీ ప్రభుత్వం అదే డిమాండ్ చేస్తోందా


కొందరు సినిమా ఎగ్జిబిటర్లు సైతం ప్రభుత్వంలో ఈ అభిప్రాయం వ్యక్తం అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇక, ఎంపీ భరత్ చేసిన ట్వీట్..ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అభిప్రాయం పైన టాలీవుడ్ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇది మరో వివాదంగా మారుతుందా..లేక, టాలీవుడ్ కు చెందిన కీలక వ్యక్తులు ప్రచారం సాగుతున్నట్లుగా నేరుగా సీఎం జగన్ తో సమావేశమై సమస్యలను పరిష్కరించుకుంటారా అనేది వేచి చూడాలి. ఈ మొత్తం వ్యవహారం పైన ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
YSRCP MP Margani Bharath sensational comments on tollywood, He demanded that tollywood bigges has to come forward to setup film industry in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X