ఏపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి శిఖండులు అవసరమా? ఎంపీ మార్గాని భరత్ తీవ్రవ్యాఖ్యలు!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఎంత దిగజారడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిదని ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు.
అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్ రామ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు బిహారీ గుండా అన్నారని, డెకాయిట్ గా అభివర్ణించారని, అదే చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారని పేర్కొన్నారు.

రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు అన్నారు. ఇక ఈ విషయం చంద్రబాబు దిగజారుడు తనాన్ని ప్రూవ్ చేస్తుందని పేర్కొన్న ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రజలందరూ దీనిని గమనించాలన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి శిఖండులు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుతో భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకము అమలు కాదని పేర్కొన్న ఎంపీ మార్గాని భరత్ రామ్ సీఎం జగన్ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలను రద్దు చేసేస్తాడు అని , ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు చేస్తాడని పేర్కొన్నారు.
ఇక చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేల స్థాన మార్పుపై, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటి అని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్న ఎంపీ మార్గాని భరత్ రామ్ మరి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పానికి రాలేదా అంటూ ప్రశ్నించారు. హైదరాబాదులో ఉండే లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయలేదా అంటూ నిలదీశారు.తనకో నీతి, పరులకో నీతి అన్నట్టు చంద్రబాబు వ్యవహార శైలి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications