టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు అవమానం: మేకపాటి, ఎక్కడకూ వెళ్లొద్దు: కళా
నెల్లూరు/విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో ఆ పార్టీలో అవమానాలు తప్పవని వైసిపి నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం నాడు జోస్యం చెప్పారు.
టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. ఆ ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవమానాలు తప్పవని చెప్పారు.

ఎక్కడకూ వెళ్లొద్దు: కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎమ్మెల్యేలు ఎవరూ దూరప్రయాణాలు పెట్టుకోవద్దని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు సూచించారు. రాజ్యసభ ఎన్నికలు ముగిసే వరకు అందుబాటులో ఉండాలని సూచించారు.
అమృత్ నగరాలపై మంత్రి నారాయణ
అమృత్ నగరాలుగా 33 మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నారాయణ మంగళవారం వెల్లడించారు. వీటి కోసం కేంద్రం రూ.400 కోట్లు, రాష్ట్రం నుండి రూ.400 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుందన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనుల పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications