Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిథున్ రెడ్డి ఆపరేషన్ పిఠాపురం - కీలక నిర్ణయం..!!

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది. జనసేనాని పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు. ఈ సారిఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. పవన్ ఓడించాలనేది వైసీపీ టార్గెట్. టీడీపీ ఇంఛార్జ్ వర్మ పాత్ర కీలకం కానుంది. ఈ సమయంలోనే వైసీపీ ఇంఛార్జ్ మిథున్ రెడ్డి ఆపరేషన్ పిఠాపురం ప్రారంభించారు. ముఖ్య నేతలతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మారుతున్న లెక్కలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీతో అక్కడ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో సామాజిక లెక్కలు కలిసి వస్తాయనే అంచనాతో పవన్ పిఠాపురం ఎంచుకున్నారు. అక్కడ అప్పటికే వైసీపీ నుంచి వంగా గీత అభ్యర్దిగా ఖరారయ్యారు. గీత 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.పవన - గీత ఒకటే సామాజిక వర్గం కావటంతో ఇక్కడ వార్ మరింత ఉత్కంఠ పెంచుతోంది. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా, రాజ్యసభ సభ్యురాలిగా, కాకినాడ ఎంపీగా పిఠాపురంలో గీతకు పట్టు ఉంది. పవన్ పిఠాపురంలో మూడు రోజులు పర్యటించారు. ఉగాది వేడుకలకు హాజరయ్యారు. పిఠాపురంలో ఇంటిని తీసుకున్న పవన్ క మద్దతుగా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.

MP Mithun Reddy begins operation pithapuram key directions for party leaders in the constitunecy

మిథున్ దిశా నిర్దేశం
ఇటు వైసీపీ గోదావరి జిల్లాల ఇంఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొనే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగా పిఠాపురం లో ప్రచారం, ఎన్నిక పైన ముద్రగడ, వంగా గీత, దొరబాబు, జనసేన నుంచి తాజాగా వైసీపీలో చేరిన ముఖ్యులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. సామాజిక సమీకరణాల పైనా చర్చ జరిగింది. నియోజకవర్గంలో అమలు చేసిన సంక్షేమం కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, టీడీపీ - జనసేన మద్య సమన్వయం పైనా మిథున్ ఆరా తీసారు. తాము పిఠాపురం గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయటం లేదని.. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని మిథున్ చెప్పుకొచ్చారు.

ముద్రగడను దించుతారా
పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో డబ్బులు గురించి పవన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 19న కాకినాడ పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్దం సభ ఉంటుందని మిథున్ వెల్లడించారు. ఇదే సమయంలో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్దిగా ముద్రగడను బరిలోకి దించటం పైనా చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ముద్రగడ ఇప్పటికే పిఠాపురం లో వైసీపీకి మద్దతుగా గ్రామాల వారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వంగా గీత అభ్యర్దిగా కొనసాగుతున్న సమయంలో ముద్రగడకు సీటు ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. గెలవాలని పవన్.. ఓడించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలతో పిఠాపురం ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+