లోకేష్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ : ఎమ్మెల్యేగా పోటీ చేస్తా - తేల్చుకుందాం..!!
తాను తంబళ్లపల్లె నుంచి పోటీ చేస్తానని..ఎంపీ మిథున్ రెడ్డి లోకేష్ కు సవాల్ చేసారు.
టీడీపీ నేత నారా లోకేష్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ చేసారు. చిత్తూరు జిల్లా బిడ్డవైతే తన సవాల్ స్వీకరించాలన్నారు. అభివృద్ధిపై చర్చకు నారా లోకేష్ సిద్ధమా అని ప్రశ్నించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన మిధున్ రెడ్డి స్పందించారు. తాను తంబళ్లపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమనా..తనతో లోకేష్ పోటీ చేస్తారా అని నిలదీసారు. లోకేష్ ఈ నెల 12న చర్చకు రావాలని మిథున్ ఛాలెంజ్ చేసారు. లోకేష్ చర్చకు రాకపోతే భయపడినట్లు అనుకుంటామని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు లోకేష్ ఏ విధంగాగా స్పందిస్తారనేది చూడాలి.
నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పాపాల మిథున్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన మిథున్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు లోకేష్ ఏం మాట్లాడినా ఓపిక పట్టామని చెప్పారు. ఈ నెల 12వ తేదీన తంబళ్లపల్లెలో లోకేశ్ తో బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. జిల్లాలో తంబళ్లపల్లెతో సహా ఏ నియోజకవర్గంలో అయినా తాను పోటీకి సిద్దమని మిథున్ రెడ్డి ప్రకటించారు. చర్చకు వస్తే పోటీకి సైతం సిద్ధం అయ్యి లోకేశ్ రావాలని సవాల్ చేసారు. ఒకవేళ లోకేష్ తన సవాల్ స్వీకరంచిన చర్చకు రాకపోతే..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నాడని భావించాల్సి ఉంటుందన్నారు. వయసులో పెద్దవారిని ఏకవచనంతో లోకేష్ సంబోధించటం పైన మిథున్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు.

చిత్తూరు జిల్లా డీఎన్ఏ లోకేష్‌లో ఉంటే జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేసారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఆపేస్తామని లోకేష్ మాట్లాడుతున్నాడని, ప్రజలు కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ సమ్మిట్‌లో లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రగిరి ఎంత అభివృద్ధి జరిగిందో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని గడప గడపకు వచ్చి అండగా నిలిచారని ఎంపీ అని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications