Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ బోసు వర్సస్ మంత్రి వేణు - సీఎం సీరియస్, తేల్చి చెప్పేసారు..!!

మంత్రి వేణుగోపాలకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎంకు బోస్‌ ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఇద్దరు సీనియర్లు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించటం ఏంటని సీఎం సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డిని ఆదేశించారు. ఎంపీ కుమారుడికి టికెట్ అంశం తాను చూసుకుంటానని.. పార్టీలో ఇటువంటివి ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Recommended Video

    పిల్లి పై Ys Jagan సీరియస్..AP Politics పై Insight.. Konaseema రగడ | Telugu OneIndia

    ముఖ్యమంత్రి జగన్ దృష్టి
    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతల మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎంపీ బోసును సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిచారు.

    MP Pilli Bose

    వారిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎంకు బోస్‌ ఫిర్యాదు చేశారు. మంత్రి వేణు, ఆయన తనయుడు నరేన్‌ అక్రమాలను లిఖితపూర్వకంగానే సీఎంకు బోస్‌ నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం.

    విభేదాలపై సీఎం సీరియస్
    అంతకు ముందు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోనూ, ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితోనూ బోస్‌ సమావేశమయ్యారు. తన విజయానికి సహక రించిన వైసీపీ నేతలపై మంత్రి వేణు అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లను నమోదు చేయించి వేధిస్తున్నారని బోసు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసారని తెలుస్తోంది.

    కార్యకర్తల ఆలోచన మేరకే తాము పని చేయాల్సి ఉందని..తుది నిర్ణయం మీరే తీసుకోవాలని సీఎంతో బోసు చెప్పుకున్నట్లు సమాచారం. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు గురించి సమావేశం అయిన అంశం చర్చకు వచ్చింది. బోసు కుమారుడు రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని..విభేదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని సీఎం నిర్దేశించారు.

    MP Pilli Bose

    టికెట్ దక్కేదెవరికి
    బోస్‌తో సమావేశం అనంతరం సీఎం జగన్ తో ఎంపీ మిథున్‌రెడ్డి భేటీ అయ్యారు. రామచంద్రపురంలో మంత్రి వేణు, ఎంపీ బోస్‌ మధ్య నెలకొన్న విభేదాలు, నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌లో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపరం లో పర్యటించనున్నారు.

    ఈలోగా ఇద్దరి నేతలతోనూ చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. అటు ఎంపీ వర్గం బోసు తన కుమారుడికి టికెట్ కు తన ఎంపీ పదవి కారణమైతే దాన్ని వదులుకోవటానికి సిద్దమనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రామచంద్రాపురం సీటు విషయంలో సీఎం నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+