బీజేపీని తిడతారా? హిందువులకు క్షమాపణలు చెప్పండి

Rahul Gandhi Speech: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన అధికార ఎన్డీఏపై చెలరేగిపోయారు. నిప్పులు చెరిగారు. నీట్ మొదలుకుని అగ్నివీర్ దాకా జాతీయస్థాయిలో దేశ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలన్నింటినీ ప్రస్తావించారు. అధికార కూటమిని ఎండగట్టారు.

బీజేనీ హింసాత్మక వాతావరణాన్ని, దాడులు- ప్రతిదాడులను కోరుకుంటోందంటూ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన తన వివరించారు. మణిపూర్ దాడులను సైతం గుర్తు చేశారు. నెలల తరబడి మణిపూర్ తగలబడినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పిన సందర్భాలు లేవంటూ ధ్వజమెత్తారు.

MP Purandeswari demands Rahul Gandhi to apology

దీనిపై మోదీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ- మొత్తం హిందూ సమాజానికి దాడులను అంటగడుతున్నారని, మొత్తం హిందువులను హింసావాదులుగా చిత్రీకరిస్తోన్నారని అన్నారు. దీనిపైనా ఎదురుదాడికి దిగారు రాహుల్ గాంధీ. హిందువులు అంటే బీజేపీ కాదని గుర్తు చేశారు. హిందువులు ఎవరూ బీజేపీ, మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెంట లేరని చెప్పారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తప్పుపట్టారు. 1975లో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన కాంగ్రెస్.. ఇప్పుడు అహింస గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్‌లో నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

హిందువులు అందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారంటూ మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వెంటనే యావత్ దేశానికి, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+