రజనీకాంత్ తో భేటీ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజు
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూపర్ స్టార్ రజినీకాంత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రఘురామ తెలిపారు. తాను సూపర్ స్టార్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రజనీకాంత్ తో కాసేపు ముచ్చటించానన్నారు. దివంగత కన్నడ నటుడు అంబరీష్, పార్లమెంటు సభ్యురాలు సుమలత కుమారుడు అభిషేక్ వివాహం జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీరంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీ రఘురామ కూడా ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.
రజనీకాంత్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ను రఘురామ ఆప్యాయంగా పలకరించారు.. ఆ తర్వాత ఇద్దరూ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఎంపీ రఘురామ తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రజనీకాంత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనే సందేహం కలిగిందంటూ చంద్రబాబుపై రజనీ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తాజాగా రఘురామ రజనీతో సమావేశమవడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల తాను హైదరాబాద్ లో పర్యటించిన సమయంలో తనకు న్యాయార్క్ లో ఉన్నామా? అనే సందేహం కలిగిందని రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో తెలిపారు. ఐటీ రంగంతోపాటు ఇతర అన్నిరంగాలు అభివృద్ధి పథంలో ఉండటానికి చంద్రబాబు వేసిన పునాదే అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను రజనీకాంత్ కొనియాడటంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తాము హైదరాబాద్ ను నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications