2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఇదే సంకేతం - వైసీపీ తాజా అంచనాలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ విజయం పైన అధికార, ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఏపీలో పంచాయితీ ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో టీడీపీ తమ బలం పెరిగిందని చెబుతోంది. అధికార వైసీపీ ఫలితాల లెక్కలను వెల్లడించింది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఈ ఫలితాలు సంకేతంగా పార్టీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి విశ్లేషించారు.

రాష్ట్రంలో పంచాయితీ ఉప ఎన్నికలు జరిగాయి. 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైసీపీ మద్దతు దారులు విజయం సాధించారు.

YSR Congress Party Flags

10 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైసీపీ, 90 టీడీపీ, 4 నసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్దుల్లో జనసేన సపోర్టర్స్ గెలుపొందారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో అయిదుగురు వైసీపీ మద్దతుదారులు విజయ దుందుభి మొగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ మద్దతుదారు గెలుపొందారు. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. అయితే, ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని టీడీపీ ప్రచారం చేస్తోంది.

ఈ ఫలితాల పైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ట్వీట్ చేసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. సాయిరెడ్డి తన ట్వీట్ లో.."ఎన్నిక ఏదైనా ఫ్యాన్ గాలిదే ప్రభంజనం. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతానికి పైగా YSRCP కైవసం. కుప్పంలో ఆరు వార్డు స్థానాలకుగాను ఐదు వశం. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఇదే సంకేతం..." అంటూ విశ్లేషించారు.

ఇదే సమయంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ కేంద్రంగా విజన్ -2047 పేరుతో ఒక డాక్యుమెంట్ విడుదల చేసారు. దీని పైన సాయిరెడ్డి స్పందించారు. కేంద్రం విడుదల చేసిన నివేదికనే చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సాయిరెడ్డి.."విజన్ 2047 అనేది చంద్రబాబు గారి సొంత బ్రాండింగ్ ఏమీ కాదు.

ఏడాది క్రితమే నీతి ఆయోగ్ 'వికసిత భారత్-2047' ప్రణాళికను విడుదల చేసింది. 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అందులో పేర్కొంది. దానినే బాబు గారు కాపీ కొట్టి దేశానికి, రాష్ట్రానికి తాను దిశా నిర్దేశం చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారు.." అంటూ వివరించారు. ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్ల పైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+