Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిక్ బాబు ఔట్ అండ్..: వైసీపీ ప్లీనరీ థీమ్ ఇదే: గన్నుల్లాంటి స్లోగన్స్ తయ్యార్: టార్గెట్ 175

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ప్లీనరీ నిర్వహణ చర్యల్లో తలమునకలైంది. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు ముగిశాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన నిర్వహించబోయే ప్లీనరీని విజయవంతం చేయడానికి కసరత్తు చేస్తోన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని భావిస్తోన్నారు.

ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలన..

ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలన..

ప్లీనరీ ఏర్పాట్లల్లో భాగంగా కొద్దిసేపటి కిందటే పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయి రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత.. ప్లీనరీ వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వారు అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వేదమంత్రంలా మేనిఫెస్టో..

వేదమంత్రంలా మేనిఫెస్టో..

పార్టీ మేనిఫెస్టోను తాము ఒక వేదంలా భావిస్తోన్నామని, ఇందులో పొందుపరిచిన హామీల్లో 95 శాతం అమలు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ముడు సంవత్సరాల్లోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత గల పార్టీ దేశంలో మరేదీ లేదని పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వేగంగా ఎన్నికల హామీలు, మేనిఫెస్టోను అమలు చేయలేదని చెప్పారు. అలాంటి వైసీపీతో కలిసి సాగడాన్ని తాము గర్వకారణంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.

చెప్పినవి.. చెప్పనివి కూడా..

చెప్పినవి.. చెప్పనివి కూడా..

అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలోని మేనిఫెస్టోలో పెట్టినవి, పెట్టనివి కూడా అమలు చేశామని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తామేదో ప్రతిపక్ష పార్టీల్లాగా చేయనివి కూడా చేసినట్లు చెప్పుకోవట్లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయిని లబ్దిదారులకు చేర్చగలుగుతున్నామని, దీనికి ప్రధాన కారణం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబద్ధత, చిత్తశుద్ధే కారణమని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు.

పరిపాలన వివరించేలా..

పరిపాలన వివరించేలా..

గతంలో తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ఎక్కడా కనపడనివ్వకుండా చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చివరికి పార్టీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా దాన్ని తొలగించిందని చెప్పారు. తొలి మూడు సంవత్సరాల్లో తమ పరిపాలన గురించి ప్రజలకు వివరించేలా ప్లీనరీ సాగుతుందని సజ్జల అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం

రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకున్నామని, వాటిని ఈ ప్లీనరీ ద్వారా ప్రకటిస్తామని అన్నారు. దీనికి సంబంధించిన పలు తీర్మానాలను ఆమోదిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అంతా ఇక ముందు వైఎస్ఆర్సీపీదేనని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు-వైఎస్ఆర్సీపీ రెండూ ముడిపడి ఉండబోతోన్నాయని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండబోతోందని అన్నారు.

ప్రజల అజెండాగా

ప్రజల అజెండాగా

కోట్లాది మంది ప్రజలు తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారని, అందుకే- ఏపీ భవిష్యత్తుతో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రస్థానం సాగుతుందని చెప్పారు. దీన్ని ఎవరూ విడదీయలేరని సజ్జల స్పష్టం చేశారు. ప్లీనరీ అనేది ఒక పార్టీకి సంబంధించినదిగా భావించట్లేదని తేల్చి చెప్పారాయన. ఇది ప్రజల అజెండా అని అభివర్ణించారు. వారి ఆకాంక్షలను ప్రతిఫలించేలా, వారి అభీష్ఠానికి అనుగుణంగా పరిపాలన సాగించడానికి అవసరమైన తీర్మానాలను ఇందులో రూపొందిస్తామని అన్నారు.

కిక్ ద బాబు ఔట్..

కిక్ ద బాబు ఔట్..

కిక్‌ ద బాబు ఔట్‌ అనే స్లోగన్‌తో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయి రెడ్డి అన్నారు. కిక్ ద బాబు ఔట్, గెట్ ది పవర్-అండ్ సర్వ్ ది పీపుల్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలనే లక్ష్యంతో 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. జులై 8వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారని వివరించారు. ఆ మరుసటి రోజే అంటే 9వ తేదీన వైఎస్ జగన్ ప్రసంగంతో ముగుస్తుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+